»   » ఎన్టీఆర్ ..రోబో లాంటోడు, బన్ని రబ్బర్ మనిషిలా...

ఎన్టీఆర్ ..రోబో లాంటోడు, బన్ని రబ్బర్ మనిషిలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బన్నీ ఎనర్జీ అంటే ఇష్టం. రబ్బర్‌ మనిషిలా డాన్సలు చేస్తాడు. అతన్ని చూస్తే నాకు జెలసీగా ఉంటుంది. ఎన్టీఆర్‌ రోబోలాంటివాడు. పేజీ డైలాగ్‌ అయినా రోబోలా స్కాన్ చేసి సింగిల్‌ టేక్‌లో ఓకే చేయిస్తాడు అంటోంది సీనియర్ సహాయ నటి హేమ.

అలాగే నాగార్జునగారంటే ఇష్టం. వెయ్యి మందిలో కూడా నన్ను గుర్తించి ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన బిజినెస్ మెన్ కావచ్చు. కానీ కమర్షియాలిటీ కనిపించదు అంటూ చెప్పుకొచ్చారామె.

Hema talks about ntr and Bunny

ఇక బ్రహ్మానందం, నాది మంచి కాంబినేషన్‌. 'అతడు' సినిమాలో కాఫీ కప్పు సీన్‌ అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మానందం తన పాత్రను ఇంప్రూవ్‌ చేస్తాడు. స్క్రిప్టు లో ఉన్న డైలాగ్స్‌కు అదనంగా జోడిస్తాడు. దానికి నేను రిటార్ట్‌ ఇవ్వగలుగుతా. అందుకే మా కామెడీ బాగా పండుతుంది అంటూ చెప్పుకొచ్చింది.

సినీ పరిశ్రమపై తనకున్న ప్రేమ గురించి చెప్తూ... ఇప్పటి వరకూ 400కు పైగా చిత్రాలు చేశా. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌, లేడీడాన క్యారెక్టర్‌ చెయ్యాలని ఉంది. నిర్మలమ్మలాగా వందేళ్లు ఇక్కడ ఉండిపోవాలని ఆశ. అవకాశాలు లేకపోతే అమ్మ, అమ్మమ్మ పాత్రలు చేస్తా. లేదంటే సినిమాకు సంబంధించిన ఇంకేదో పని చేసుకుంటా. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా చేస్తా. అంతే తప్ప ఎక్కడికీ వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది.

English summary
Hema is a popular actress in the Telugu film industry and mainly does character roles. She talked about Ntr, bunny and Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu