»   » "మహనటి" నెగెటివ్ ఫీడ్ బ్యాక్, పవన్ సినిమాకీ ఇబ్బందే

"మహనటి" నెగెటివ్ ఫీడ్ బ్యాక్, పవన్ సినిమాకీ ఇబ్బందే

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదట్లో విధ్యా బాలన్ అన్నారు, తర్వాత అనుష్కపేరు వినిపించింది, మధ్యలో నిత్యామీనన్ పేరూ వినిపించింది... అటూ ఇటూ తిరిగి కీర్తీ సురేష్ ని 'మహానటి' సావిత్రి పాత్రకి ఎంచుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమయింది. నిన్నా మొన్న తేరమీదకి వచ్చిన ఈ అమ్మాయి, ఒకప్పుడు సౌత్ ఇండియన్ తేరని ఏలిన మహానటి సావిత్రి పాత్రకి సరిపోతుందా, అసలు ఏం ఆలోచించి తీసుకున్నారు? అంటూ పెదవి విరిచారు.

ఫీడ్‌బ్యాక్‌తో అలర్ట్‌ అయింది

ఫీడ్‌బ్యాక్‌తో అలర్ట్‌ అయింది

అయితే మేకప్‌ టెస్ట్‌ చేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మిగతా అందరి కంటే కీర్తి లుక్‌తోనే శాటిస్‌ఫై అయ్యాడు. ఇటీవలే షూటింగ్‌ మొదలైన ఈ చిత్రంలోని కీర్తి లుక్‌ లీక్‌ అయింది. సీక్రెట్‌గా వుంచుదామని అనుకున్న లుక్‌ లీక్‌ అయిందని మహానటి బృందం తొలుత హర్ట్‌ అయినా కానీ, కీర్తి లుక్‌కి వస్తోన్న ఫీడ్‌బ్యాక్‌తో అలర్ట్‌ అయింది.


మరీ సన్నగా వుందని

మరీ సన్నగా వుందని

బయటకు లీక్ అవకపోయి ఉంటే అసలు ఫీడ్బ్యాక్ ఉండేది కాదు. కీర్తీసురేష్ లూక్ బాగానే ఉన్నా... సావిత్రి గారి లా బొద్దుగా కనిపించటం లేదు.నిజానికి అప్పట్లో ఉన్న హీరోయిన్లలో సావిత్రి గారు వేరు. ఆమె లావుగా ఉన్నా ప్రతీ పాత్రకీ సరిగ్గా సరిపోయేవారు. అయితే ఇప్పుడు కీర్తి మరీ సన్నగా వుందని, సావిత్రిలా అనిపించడం లేదని కామెంట్స్‌ వస్తూ వుండడంతో ఆమెని కాస్త బరువు పెరగమని చెప్పారట.


పవన్‌కళ్యాణ్‌ సినిమా కోసం

పవన్‌కళ్యాణ్‌ సినిమా కోసం

అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది ఈ సినిమా కోసం లావెక్కితే కీర్తీ ఇప్పుడు చేస్తున్న మిగతా సినిమాలకి ఇబ్బంది వస్తుంది.నిజానికి మొన్నటి వరకూ కీర్తీ మరీ మెరుపు తీగ ఏం కాదు కాస్త బొద్దుగానే ఉండేది కానీ ఇటీవలే త్రివిక్రమ్‌ ఆదేశాల మేరకు పవన్‌కళ్యాణ్‌ సినిమా కోసం కీర్తి సురేష్‌ బరువు తగ్గింది.


వాయిదా వేస్తారా

వాయిదా వేస్తారా

ఇప్పుడు మళ్లీ బరువు పెరిగితే ఆ చిత్రానికి ఇబ్బంది వస్తుంది. అలా అని సన్నగా ఉండిపోతే "మహానటి"కి ఇబ్బందే అదన్న మాట... మరి పవన్‌ సినిమా పూర్తయ్యే వరకు 'మహానటి'లో కీర్తి పార్ట్‌ షూటింగ్‌ వాయిదా వేస్తారా లేక సావిత్రి తొలినాళ్ళ సీన్లు తీసి సరిపెడతారా అన్నది చూడాలి మరి.
English summary
here is a glimpse of how Keerthy looks in Savitri’s getup.Keerthy looks young, lean and doesn’t even look remotely close to the legendary actress in the leaked pictures from the sets of Mahanati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu