»   »  షాక్ : నితిన్ , పూరి జగన్నాథ్ సినిమా కాన్సిల్

షాక్ : నితిన్ , పూరి జగన్నాథ్ సినిమా కాన్సిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో మరో సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్, పూరి ఇద్దరూ కూడా ఖరారు చేసారు. మొన్ననే ఫైనల్ నేరేషన్ విన్నాను. సినిమా ఓ హార్ట్ టచ్చింగ్ పాయింట్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ..జూన్ 15 నుంచి షూటింగ్ అని నితిన్ ఆనందంగా కూడా ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నితిన్ ట్వీట్ చేస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ చూడండి.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

Hero Nitin cancels Puri Jagan's movie

ఇక పూరి రిలీజ్ కు రెడీగా ఉన్న జ్యోతి లక్ష్మి చిత్రం విషయానికి వస్తే...

పూరి దర్శకత్వం వహించిన చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఛార్మి ప్రధాన పాత్రధారి. వరుణ్‌ తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'జ్యోతిలక్ష్మీ' తొలి గీతాన్ని విడుదల చేశారు. 'జ్యోతిలక్ష్మీ ఐయామ్‌ కాస్ట్‌లీ టు టచ్‌ మీ..' అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రచించారు.

సునీల్‌ కశ్యప్‌ సంగీత సారథ్యంలో ఉమా నేహా గానం చేశారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''జ్యోతిలక్ష్మీ స్వభావాన్ని వ్యక్తం చేసే గీతమిది. భాస్కరభట్ల చక్కగా రాశారు. ఈ నెల 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

పూరి మాట్లాడుతూ...జ్యోతిలక్ష్మీ అమ్మాయి కాదు. ఆటమ్‌బాంబు లెక్క! మాటలు సీమటపాకాయల్లా పేల్తూనే ఉంటాయి. ఇక పాటపాడితే.. మామూలుగా ఉంటుందా? అందుకే 'ఏయ్‌ రాసుకోరా సాంబ..' అంటూ తన గురించి తాను గొప్పగా ఆవిష్కరించుకొంది. ఆ సంగతేంటో తెలియాలంటే జ్యోతిలక్ష్మీ సినిమా చూడాల్సిందే అంటున్నారు

English summary
Nitin shared, “My film with Puri garu is not happening due to unavoidable circumstances. Hope to work with him in the future”, (sic) via his micro-blogging site. One wonders what made a happening hero like Nithin cancel a film with a dashing director like Puri Jagan.
Please Wait while comments are loading...