హీరో రాజా కి పెళ్లి కుదిరింది..డిటేల్స్
హైదరాబాద్ :'ఆనంద్' చిత్రంతో ఆకట్టుకొన్న హీరో రాజా. ఇప్పుడో ఇంటివాడు కాబోతున్నాడు. చెన్నైకి చెందిన అమ్రితను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. అమ్రిత ఓ లీడింగ్ బిజినెస్ మ్యాన్ కుమార్తె. చెన్నై లో వివాహం, హైదరాబాద్ లో రిసెప్షన్.
హీరో రాజా మాట్లాడుతూ... ''ఇది పెద్దల కుదిర్చిన సంబంధమే. మార్చి మొదటి వారంలో నిశ్చితార్థం. ఏప్రిల్‌లో పెళ్లి. ఈ శుభకార్యం చెన్నైలో జరుగుతుంది'' అన్నారు. ప్రస్తుతం 'పార్కింగ్' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతోంది.

ఇక రాజా ఖాళీ పడటానికి కారణాలు అనేకం.ముఖ్యంగా సినిమాలు వరసగా ప్లాప్ అవటం కారణం. వీటితో పాటు సక్సెస్ రేటు లేకున్నా రెమ్యునేషన్ మాత్రం భారీగా అడగటం జరిగింది. మరో ప్రక్క శాటిలైట్ మార్కెట్ కూడా రాజా అస్సలు లేకుండా పోయింది. దాంతో రాజా అంటే ఏ దర్శకుడూ, నిర్మాత ధైర్యం చేయటం లేదు. పెళ్లితో చాలా మందికి దశ తిరుగుతుంది అంటారు. ఈ వివాహం తో అయినా రాజా కి కలిసి రావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











