»   » రాజా లేటెస్ట్ చిత్రం 'ఇంకోసారి' స్టోరీ లైన్

రాజా లేటెస్ట్ చిత్రం 'ఇంకోసారి' స్టోరీ లైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజా, మంజరి (సిద్దూ ఫ్రమ్‌ సికాకోళం ఫేమ్‌), రిచా (నువ్వే కావాలి ఫేం) హీరో, హీరోయిన్లుగా రూపొందింన చిత్రం 'ఇంకోసారి". సెకెండ్ ఛాన్స్ జీవితంలో అతిముఖ్యమైనదంటూ..బే మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 26న విడుదల అవుతున్న ఈచిత్రం కథాంశం గురించి నిర్మాత కల్యాణ్‌ పల్ల మాట్లాడుతూ "కాలేజీలో కలిసి సరదాగా తిరిగిన ఆ బృందమంతా ఎవరికి వారు జీవితంలో స్థిరపడిపోతారు. ఏడేళ్ల తర్వాత మళ్లీ కలుస్తారు. ఆ కలయిక వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నది ఆసక్తికరం అంటున్నారు. ఇక ఈ చిత్రంతో దర్శకుడు గా పరిచయం అవుతున్న సుమన్‌ పాతూరి మాట్లాడుతూ "కాలం మనిషిలో తెచ్చే మార్పులు, అనుభూతులు, పరిణామాల్ని చూపించే చిత్రమిది. కాలేజీ వదిలేసిన కొన్నేళ్లకు మిత్రులందరూ కలుసుకొంటే దొర్లే అనుభూతులూ, సరదాలూ అన్నీ తెర మీద కనిపిస్తాయి. అవి చూశాక ఇంకొక్కసారి ఆ రోజులు వస్తే బాగుణ్ను అనిపిస్తాయ"న్నారు. ఇక ఈ చిత్రం మిగతా పాత్రల్లో రవివర్మ, వెన్నెల కిషోర్‌, సాందీప్‌, రావు రమేష్‌, గొల్లపూడి మారుతీరావు, భార్గవి, సైరాభాను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్‌ శంకర్‌, పాటలు: వనమాలి, కథ, స్క్రీన్‌ప్లే: రాజ్‌ డి.కె., సీతా మీనన్‌; మాటలు: నాగరాజు గంధం, ఛాయాగ్రహణం: రంగనాథ్‌బాబు.జి. నిర్వహిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu