»   » కత్తి పట్టుకోకపోతే సినిమా ఫ్లో పడిపోతుందని...రామ్

కత్తి పట్టుకోకపోతే సినిమా ఫ్లో పడిపోతుందని...రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరో సినిమాకే నేను కత్తిపట్టుకోనని దర్శకుడికి ముందే చెప్పాను. కానీ ఆ కథలోని ఆ పరిస్థితిలో కత్తి పట్టుకోకపోతే సినిమా ఫ్లో పడిపోతుందని 'రామ రామ కృష్ణ కృష్ణ" దర్శకుడు నన్ను కన్విన్స్ చేశాడు. ఆ సినిమా విషయంలో నేను ఏదైతే చేయకూడదని అనుకున్నానో అదే చేశాను. నేను చేస్తున్న తప్పు నాకు ముందే తెలిసింది. ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా చాలా బాధగా వుంటుంది. అలాగే నేను బాగా నమ్మి ఇన్‌వాల్వ్ అయ్యి, కష్టపడి చేసిన 'జగడం" చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేదు అనే విషయాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అన్నారు రామ్. ఆయన ఈ రోజు(ఆదివారం)పుట్టిన రోజు జరుపుకుంటూ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే తన తాజా చిత్రం కందిరీగ గురించి మాట్లాడుతూ..''కొంచెం తిక్క, కొంచెం తింగరితనం నిండిన కుర్రాడి కథ 'కందిరీగ'. యువతరానికి నచ్చేలా ఉంటుంది. కొన్ని కథలను తొలిసారి విన్నప్పుడు బాగా నవ్వుకొంటాం. రెండోసారి వింటే నవ్వురాదు. ఈ కథను మాత్రం ఐదుసార్లు విని చేశాను. కథలోనూ, నా పాత్రలోనూ చక్కటి వినోదం ఉంటుంది. మాస్‌ మసాలా అంశాలు పుష్కలంగా ఉంటాయి. జులైలో ప్రేక్షకుల ముందుకొస్తాం'' అంటున్నారు రామ్.

English summary
Ram’s new film Kandireega in the direction of Santosh Srinivas will hit the silver-screens in the month of July. Currently, the patch work of the film is being wrapped up, simultaneously progressing the post-production works.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu