»   » సారీ చెప్తూ... బాహుబలి 2 ట్రైలర్‌పై హీరో రామ్ ట్వీట్ !

సారీ చెప్తూ... బాహుబలి 2 ట్రైలర్‌పై హీరో రామ్ ట్వీట్ !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి పార్ట్ 1 విడుద‌లై బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో క‌నువిని ఎరుగ‌ని రీతిలో ఆరు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న పార్ట్ 2 ఎలా ఉంటుందోన‌ని ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ట్రైలర్ సినిమా రేంజ్ ఏంటో చెప్ప‌క‌నే చెప్పింది.

ట్రైలర్‌కు ముందు నుంచి ఊహించినట్లుగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గంటలోనే 1మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖుల నుంచి చిత్ర యూనిట్ కి అభినందనలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో రామ్ కూడా ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

 Hero Ram tweet about Baahubali 2 trailer

మొదట బాహుబలి2ను ది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాగా అభివర్ణించాడు. సారీ ప్రైడ్ ఆఫ్ సౌత్ సినిమా.. మళ్లీ సారీ.. ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ రామ్ ట్వీట్ చేశాడు. ఎస్‌ఎస్ రాజమౌళి ఈజ్ బ్యాక్. వాట్ ఏ ట్రైలర్ అంటూ ట్రైలర్‌ను ఆకాశానికెత్తేశాడు. అంతేకాదు, రాజమౌళికి సంబంధించి ఓ ఆసక్తికర ట్వీట్ కూడా చేశాడు.

ప్రతీసారీ బంతిని బౌండరీకి మళ్లించడం కొందరి వంతైతే, ప్రతీసారీ బౌండరీ లైన్‌కొచ్చిన బంతిని పక్కకు నెట్టేయడం రాజమౌళి చేసే పనని ట్వీట్ చేశాడు.

ఇక విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదలైన ట్రైలర్‌ అద్భుతాలు సృష్టిస్తోంది. తెలుగులో విడుదలైన ట్రైలర్‌ కేవలం 12 గంటల్లో 1.50కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ రికార్డు వ్యూస్‌ చెబుతున్నాయి.

ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌ ఉంచడమే ఆలస్యం ఆ సంఖ్య లక్షల్లోకి వెళ్లిపోయింది. సాయంత్రం 4 గంటల సమయానికి ఈ ట్రైలర్‌ను కోటిమంది వీక్షించడం విశేషం. 2015 జూన్‌ 1న 'బాహుబలి: ది బిగినింగ్‌' ట్రైలర్‌ను విడుదల చేయగా, ఇప్పటివరకూ 78.41లక్షల వ్యూస్‌ వచ్చాయి. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ట్రైలర్‌ మాత్రం విడుదల రోజే ఈ రికార్డు సాధించడం విశేషం. సినిమా విడుదలయ్యేలోపు (ఏప్రిల్‌ 28) ఈ ట్రైలర్‌ మరెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.

English summary
Hero Ram Tweeted: Hitting the ball to the boundary every time is 1 thing..But Pushing the boundary every time you hit the ball is ssrajamouli 's thing!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu