»   »  ‘టచ్ చేసి చూడు’ అంటూ... ఎట్టకేలకు రవితేజ వచ్చేడు (ఫస్ట్ లుక్)

‘టచ్ చేసి చూడు’ అంటూ... ఎట్టకేలకు రవితేజ వచ్చేడు (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మాస్ మహారాజా' రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు.

జనవరి 26 (గురువారం) రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ - "మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేసారు' అని తెలిపారు.

 షూటింగ్ ఎప్పుడంటే..

షూటింగ్ ఎప్పుడంటే..

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఇద్దరు హీరోయిన్లు

ఇద్దరు హీరోయిన్లు

దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ - "ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు. ఇప్పటికే రాశి ఖన్నాను ఎంపిక చేసాం. మరొక నాయికను త్వరలోనే ప్రకటిస్తాం.హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు" అని చెప్పారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి, సంగీతం : ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు, ఎడిటింగ్ : గౌతం రాజు,
ఆర్ట్: రమణ, కో డైరెక్టర్ : రాంబాబు, ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్, యాక్షన్ : పీటర్ హేన్స్, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

 చిరంజీవి తర్వాత రవితేజ, మరో హీరో మాత్రమే... దిల్ రాజు కామెంట్స్

చిరంజీవి తర్వాత రవితేజ, మరో హీరో మాత్రమే... దిల్ రాజు కామెంట్స్

ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వెండి తెరను ఏలుతున్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమకు గోల్డెన్ డేస్ నడిచాయి. ఆ తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి తెలుగులో టాప్ పొజిషన్ కు చేరుకుని పరిశ్రమకు భారీ విజయాలను అందించారు. ఆయన తర్వాత ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలో నిలదొక్కుకున్న స్టార్స్ రవితేజ, నాని మాత్రమే అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
/news/after-chiranjeevi-it-s-only-raviteja-nani-dil-raju-056079.html

English summary
Check out Hero Raviteja New Movie 'Touch Chesi Choodu' details. The movie directed by Vikram sirikonda, Produced by Nallamalupu Srinivas and Vallabhaneni Vamsi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu