»   » సంపూర్ణేష్ బాబుకు జరిమానా

సంపూర్ణేష్ బాబుకు జరిమానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీహీరో సంపూర్ణేశ్‌బాబుకు కారులో సీటు బెల్టు ధరించని కారణంగా పోలీసులు రూ.వంద జరిమానా విధించారు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలోని విక్టరీ చౌరస్తాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ట్రాఫిక్‌ ఎస్‌ఐ మారుతిప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 27వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం వాహనదారులకు అవగాహన కల్పించారు. పట్టణంలో సీటు బెల్టు ధరించని 101 మంది వాహనదారులకు రూ.వంద చొప్పున జరిమానా విధించామని తెలియచేసారు.

Hero Sampoonesh pays fine for not wearing seat belt

 
అలాగే...జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో కార్లలో ప్రయాణించే వాహనదారులకు సీటు బెల్టు వాడకం ద్వారా ప్రయోజనాలకు సంబంధించిన కరపత్రాలు పంచారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని సూచించారు.

మద్యం సేవించి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏఎస్ఐ నర్సయ్య, సీఐ బాల్‌నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Hero Sampoonesh pays fine for not wearing seat belt

'హృదయ కాలేయం' చిత్రంతో తెలుగు తెరపై నవ్వుల పువ్వులు విరగబూయించిన సంపూర్ణేష్ బాబు.. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో కీలకపాత్రలు పోషించాడు. అతడు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కొబ్బరి మట్ట'. ఈ సినిమా తర్వాత తనను హీరోగా పరిచయం చేసిన సాయిరాజేష్ నీలం దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించేందుకు సంపూర్ణేష్ సన్నద్ధమవుతున్నాడు.

విశేషం ఏంటంటే.. సాయిరాజేష్ దర్శకత్వంలో నటీంచబోయే చిత్రం కోసం సంపూర్ణేష్ 'సిక్స్ ప్యాక్' చేయనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మునుపటిలా స్పూఫ్ కామెడీతో కాకుండా ఈసారి వైవిధ్యమైన హాస్యంతో ఆకట్టుకొనేందుకు ఈ ద్వయం రెడీ అవుతోంది. ఈ చిత్రానికి 'కార్బన్ డై ఆక్సైడ్' అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

English summary
Sampoornesh Babu paid a fine of Rs 100 for not wearing a seat belt while driving his private car.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu