»   »  రోడ్డుమీద న్యూడ్ గా నడిపించినపుడు భయమేసింది :శ్రీకాంత్

రోడ్డుమీద న్యూడ్ గా నడిపించినపుడు భయమేసింది :శ్రీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలన్ గా మొదలై చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేసి హీరోగా నిలబడటం మామూలేం కాదు మన ఇండస్ట్రీలో అలాంటి నటులు ఉన్నా ఆ సంఖ్య చాలా తక్కువ. అదే కొద్దిమందిలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. ఇన్నాళ్ళ తన సినీకెరీర్లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఈ మధ్యే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలు.....

ఒకరకంగా నేను సినిమాల్లోకి రావడానికి అన్నయ్య చిరంజీవి కారణం. కర్ణాటకలోని బళ్లారికి సమీపంలోని గంగావతిలో ఉండేవాళ్లం. అప్పట్లో ఎన్టీ రామారావు, చిరంజీవి చిత్రాలు అక్కడ బాగా విడుదల అయ్యేవి. ఎక్కువగా సినిమాలు చూసే వాడిని. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వెళ్లిపోగానే చిరంజీవి టాప్‌లిస్ట్‌లోకి వెళ్లారు. దీంతో నేను ఆయన ఫ్యాన్ అయ్యా. మొదట్లో క్రీడలపై ఆసక్తి ఉన్నా ఆ తర్వాత చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని పరిశ్రమలోకి వచ్చా.

 Hero Srikanth Latest Interview

అంటూ చెప్పిన శ్రీకాంత్ తాను చాలెంజ్ గా ఫీలైన పాత్రల్లో ఆపరేషన్ దుర్యోధన లో చేసిన పాత్ర ఒకటని చెప్తూ.. ఆ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్లోనే నగ్నంగా నడవమనటం తో కాస్త ఇబ్బంది పడ్డాడట. అయితే తాను నటున్ని కాబట్టి చేసే పనిలో బిడియం ఉండకూడదనిపించాక అదే సీన్ ని నిరభ్యంతరంగా చేసానంటూ చెప్పాడు.

ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ నటవారసత్వం మీద అదిగిన ప్రశ్నకు మాత్రం అసలు వారసత్వం అనేది విషయమే కాదన్నట్టు మాట్లాడేసాడు. వారసత్వం అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ అలా ఎవరైనా వచ్చినా అదృష్టం, టాలెంట్‌ ఉంటేనే పరిశ్రమలో నిలబడతారు. నాలానే రవితేజ, నాని, నిఖిల్‌ కూడా ఎటువంటి వారసత్వం లేకుండావచ్చి పేరు సంపాదించుకున్నారు. టాలెంట్‌ ఉంటే ఎవ్వరైనా సినీ పరిశ్రమలోకి రావచ్చు. కేవలం వారసత్వమే హక్కుగా ఇక్కడికి వచ్చేవారు ఎక్కువ కాలం పరిశ్రమలో ఉండలేరు. అంటూ విశయం లేనప్పుడు ఎంతటి వారసుడైనా ఇక్కడ అంతే అంటూ బదులిచ్చాడు.

English summary
Tollywood Hero Srikant Shared Some movements from his movie jurny in his Latest interviw
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu