»   » సినిమా టూ రాజకీయాలు: పావులు కదుపుతున్న టాలీవుడ్ హీరో, పవన్ పార్టీ వైపే చూపా?

సినిమా టూ రాజకీయాలు: పావులు కదుపుతున్న టాలీవుడ్ హీరో, పవన్ పార్టీ వైపే చూపా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లో వస్తానని ప్రకటించాడు సుమన్‌. ఏ రాజకీయ పార్టీ అన్నది ముందు ముందు చెబుతాడట. ఏదో ఒక పార్టీలో చేరిపోవడం కాదు, ప్రజల కోసం పాటుపడే పార్టీలో మాత్రమే చేరతానని ప్రకటించాడు సుమన్‌. సాధారణంగా సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో చాలా మంది తారలు రాయకీయ రంగ ప్రవేశం చేస్తారు.

హీరో సుమన్

హీరో సుమన్

అలా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో చాలామంది క్లిక్ అయ్యారు కూడా. ఇప్పుడు అదే దారిని ఎన్నుకున్నాడు ఒకప్పటికి స్టార్ హీరో సుమన్. కెరీర్ ఫేడ్ అవుతున్న సమయంలో విలన్ గా మరీనా సుమన్ అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. అయిన లాభం లేక పోవడంతో ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నాడు.

రాజకీయాల్లో సినీ గ్లామర్‌

రాజకీయాల్లో సినీ గ్లామర్‌

రాజకీయాల్లో సినీ గ్లామర్‌ గురించి కొత్తగా చెప్పుకోడానికేముంది.? చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టారు, దాన్ని కాంగ్రెస్‌లో కలిపేశారు. పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీని స్థాపించారు.. దాన్ని త్రిశంకు స్వర్గంలో నిలబెట్టారు. రోజా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా వున్నారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే అయితే, మురళీమోహన్‌ టీడీపీ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

తెలుగు రాజకీయాల్లో

తెలుగు రాజకీయాల్లో

ఇంకొందరు సినీ ప్రముఖులు తెలుగు రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు.. ఇంకొందరు ఉనినికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో సుమన్ కూడా ప్రవేశిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు.

ఉపప్రధాని పదవి

ఉపప్రధాని పదవి

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే ఏ పార్టీలోనైనా చేరడమో లేదా వారికి మద్దతివ్వడమో చేయనున్నట్లు చెప్పారు. సౌతిండియన్స్ తమ కష్టనష్టాలు చెప్పుకునేందుకు ఉపప్రధాని పదవిని దక్షిణాది రాష్ర్టాలకు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు.

English summary
Senior actor Suman made it clear that he would enter politics in 2019 Assembly polls. He said that he cannot say in which party he would join.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu