For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లవ్, సెక్స్... ఫస్ట్‌డే పేరెంట్స్‌తో రావొద్దు: పచ్చిగా చెప్పేసిన సందీప్ కిషన్

  |
  Hero Sundeep Kishan Fantastic Speech @ Next Enti Movie | Filmibeat Telugu

  సందీప్ కిషన్, తమన్నా హీరో హీరోయిన్లుగా... నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ప్ర‌ధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నెక్ట్స్ ఏంటి?'. వైకింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి, అక్ష‌య్ పురి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై రైనా జోషి ఈ చిత్రాన్ని నిర్మించారు.

  హైదరాబాద్‌లో జరిగిన 'నెక్ట్స్ ఏంటి?' ప్రీ రిలీజ్ ఈవెంటులో హీరో సందీప్ కిషన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో చూపించిన విషయం ఏమిటో? నిజాయితీగా వెల్లడించారు. ఫస్ట్ డే ఈ సినిమాకు కుర్రాళ్లు ఫ్యామిలీ లేకుండా రండి అని సూచించడం గమనార్హం.

   తప్పులు ఉంటే దిద్దుకుంటాను

  తప్పులు ఉంటే దిద్దుకుంటాను

  నేను కాలేజీ రోజుల్లో చదువుకునే సమయంలో ‘ఫనా'లోని చాంద్ సిఫారిష్ అనే పాట నా ఫేవరెట్. అపుడు నా ఫోన్లో రింగ్ టోన్ అది. నా తొలి చిత్రం స్నేహ గీతం అని అందరికీ తెలుసు. హ్యాపీడేస్ హిట్టయ్యాక ఆ కోవలో వచ్చిన సినిమా అది. హమ్ తుమ్, ఫనా సినిమాలు తీసిన కునాల్ కోహ్లిగారు, హ్యాపీడేస్ తమన్నాతో ఈ సినిమాలో పని చేశాను. ఈ సినిమా కరెక్టుగా చేశాను అనుకుంటున్నాను. ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ఉండొచ్చు. ఉంటే మార్చుకుని బెటర్ గా చేస్తాను అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.

  లవ్, సెక్స్ చాలా నార్మల్... అవన్నీ రియల్‌గా చూపించాం: తమన్నా

  అలాంటివేమీ లేవు

  అలాంటివేమీ లేవు

  మేము ఏ సినిమా చేసినా, ఎంత కష్టపడినా, తిండి మానేసినా మీ కోసమే. మీకు నచ్చడానికే. మీకు నచ్చకపోతే తిట్టే హక్కు మీకుంది, నచ్చితే పొగిడే ప్రేమ మీకు ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా నిజాయితీగా తీయాలనుకున్నాం. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్, ఈ టైమ్‌లో ఒక సాంగ్ రావాలనో, ఇక్కడ కామెడీ ట్రాక్ రావాలని ఆలోచించకుండా ఆ కథకు ఏమి అవసరమో అదే చూపించాం.

   లవ్, సెక్స్ మీద ఇంట్రస్ట్ ఉంటే నచ్చుతుంది

  లవ్, సెక్స్ మీద ఇంట్రస్ట్ ఉంటే నచ్చుతుంది

  ఈ సినిమాలో లవ్, సెక్స్ అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఈ రెండు విషయాల్లో మీకు ఏ విషయంపై ఆసక్తి ఉన్నా మీకు తప్పకుండా నచ్చుతుంది. మీలో అందరికీ ఏదో ఒక దానిపై తప్పకుండా ఆసక్తి ఉంటుందని నాకు తెలుసు.. అని సందీప్ వ్యాఖ్యానించారు.

  ఫ్యామిలీతో రావొద్దు

  ఫ్యామిలీతో రావొద్దు

  డే 1 కుర్రాళ్లు ఫ్యామిలీ లేకుండా రండి, డే 2 ఫ్యామిలీతో రండి. వచ్చినా టికెట్లు వేరే సీట్లో తీసుకుని కూర్చోపెట్టండి. హానెస్ట్ గా చెబుతున్నాను ఈ సినిమా మేము కష్టపడి తీయలేదు. చాలా సరదాగా తీశాం. ఈ రోజు వరకు ఎంజాయ్ చేస్తూనే పని చేశాం.

  సెక్స్ వల్ల కొట్టుకునే ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్

  సెక్స్ వల్ల కొట్టుకునే ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్

  ఈ సినిమా గురించి చెప్పాలంటే... సెక్స్ వల్ల కొట్టుకునే ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. ఫస్ట్ డ్రింక్ నాతో వెయ్ అని తీసుకెళ్లే ఒక తండ్రి, కూతురును నాతో ఫస్ట్ డ్రింక్ వేయాలని తీసుకెళ్లే తండ్రి... ఇలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. మీరు ఇప్పటికే చూసిన మూమెంట్సే అయినా ఎంత కొత్తగా తీయొచ్చో కునాల్ ఆయన స్టైల్ లో చెప్పారు. యశ్ రాజ్, ధర్మ ఫిల్మ్స్ స్థాయిలో విజువల్స్ మనీష్ భట్ గారు ఇచ్చారని సందీప్ కిషన్ వెల్లడించారు.

  English summary
  Hero Sundeep Kishan Fantastic Speech at Next Enti Movie. Next Enti? is an upcoming Telugu-language romantic comedy film directed by Kunal Kohli. The film stars Tamannaah, Sundeep Kishan and Navdeep in the lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X