»   » సందీప్ కిషన్ కొత్త చిత్రం.. వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో..

సందీప్ కిషన్ కొత్త చిత్రం.. వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బ్ర‌హ్మ లోకం టు య‌మ‌లోకం వ‌యా భూలోకం', 'సినిమా చూపిస్త మావ‌', 'ఉహేలి (బెంగాలీ) చిత్రాల నిర్మాత‌ల్లో రూపేష్ డీ గోహిల్ ఒకరు. తాజాగా యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా సోలో నిర్మాత‌గా సినిమాను రూపొందించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇటీవ‌ల కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌ చిత్రంతో విజ‌యాన్ని సొంతం చేసుకొన్న వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ తాజా సినిమా రూపొంద‌నున్నది.

Hero Sundeep Kishan new movie announced under RDG productions

ఈ సందర్భంగా నిర్మాత రూపేష్ డీ గోహిల్ మాట్లాడుతూ ఇంత‌కు మునుపు పార్ట్ న‌ర్ షిప్‌తో బ్ర‌హ్మ‌లోకం టు య‌మ‌లోకం వ‌యా భూలోకం, సినిమా చూపిస్త మావ‌, ఉహేలి (బెంగాలీ) అనే సినిమాల‌ను రూపొందించాం. తాజాగా సోలో నిర్మాత‌గా సందీప్ కిష‌న్ హీరోగా సినిమాను రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. మంచి అభిరుచి ఉన్న సినీ కథా రచయిత ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ చెప్పిన క‌థ న‌చ్చింది. స‌కుటుంబంగా కూర్చుని చూసే సినిమా అవుతుంది. కుటుంబ విలువ‌లున్న వినోదాత్మ‌క చిత్ర‌మవుతుంది అని అన్నారు.

Hero Sundeep Kishan new movie announced under RDG productions

జులై 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగాన్ని హైద‌రాబాద్‌లోనే తెర‌కెక్కిస్తాం. ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామని అన్నారు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌, సంగీతం: ర‌థ‌న్‌, కెమెరా: భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ ఫేమ్ నిజ‌ర్ ష‌ఫి, ఎడిట‌ర్‌: కార్తీక శ్రీనివాస్‌

English summary
Tollywood Youngster Sandeep Kishan is being roped in for another project under the banner of RDG productions. This production house is famous for making comedy entertainers like 'Brahmalokam to Yamalokam Via Bhoolokam', 'Cinema Choopista Maava' starring Raj Tharun and a Bengali Movie named 'Vuheli'.One of the filmmakers of above films named Rupesh D. Gohil is starting his own production house and roped in Sandeep Kishan as hero for the latest venture. This movie is going to be directed by Vamsi Krishna who got good success with his latest film 'Kittu Vunnadu Jagratta' starring Raj Tharun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu