twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Puneeth Rajkumar బాధ్యతలు నేను తీసుకుంటున్నా.. 1800 మంది పిల్లల్ని నేను చదివిస్తా: విశాల్

    |

    కన్నడ పవర్ స్టార్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్నటువంటి టాలెంటెడ్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్ అంతిమయాత్ర వైభవంగా జరిగింది. ఇక కడసారి చూసేందుకు అభిమానులతో పాటు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా బెంగళూరుకు వెళ్లారు. తెనుగు ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ కూడా పునీత్ భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు వెళ్లారు. ఇక ఎక్కడ ఎలాంటి సినిమా వేడుకలు జరిగిన కూడా పునీత్ రాజ్ కుమార్ ను సినీ తారలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఇక పునీత్ రాజ్ కుమార్ చేపట్టిన ఒక మంచి కార్యక్రమం మధ్యలో ఆగిపోకూడదు అని.. దానిని నేను కొనసాగిస్తాను అంటూ హీరో విశాల్ తెలియజేయడం అందరినీ ఆకట్టుకుంది.

     మంచి మనసున్న వ్యక్తి

    మంచి మనసున్న వ్యక్తి

    హీరో విశాల్ ఇటీవల హైదరాబాదులో ఎనిమీ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్ లో పునీత్ రాజ్ కుమార్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. విశాల్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ లాంటి వ్యక్తిని నా జీవితంలో నేను చూడలేదు. చాలా మంచి మనసున్న వ్యక్తి. మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఎప్పుడు ఒకేలా కనిపించే మంచి మనస్తత్వం ఉన్న మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.. అని విశాల్ అన్నాడు

     1800 పిల్లలకు ఉచితంగా విద్య

    1800 పిల్లలకు ఉచితంగా విద్య

    ఇక పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని గురించి అందరూ చెబుతూనే ఉన్నారు. ఇక ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా తన వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. 1800 మంది పిల్లల భవిష్యత్తును బాధ్యతగా తీసుకొని వారికి ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. నిజంగా ఒక ప్రభుత్వం చేయాల్సిన ఈ పనులన్నీ కూడా పునీత్ రాజ్ కుమార్ ఎంతో ధైర్యంగా చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.. అని విశాల్ చెప్పాడు.

     ప్రతి ఒక్కరి గుండెల్లో పునీత్..

    ప్రతి ఒక్కరి గుండెల్లో పునీత్..

    ఉచితంగా విద్యను అందించడమే కాకుండా ఎంతో మంది పేదలకు సాయం చేశాడు. అంతేకాకుండా చనిపోయిన తరువాత కూడా తన కళ్లను కూడా దానం చేశాడు. ఇవన్నీ తెలిసిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడు అనగానే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నేను చేసిన కొన్ని రీమేక్ సినిమాలు కూడా ఆయన చేశారు. పైన ఏ లోకంలో ఉన్నా కూడా మా ప్రతి ఒక్కరి గుండెల్లో పునీత్ నిలిచి పోతూ ఉంటారు.

    Recommended Video

    Rana Daggubati Launches First Single Acha Telugandame From Hero
    వారి భవిష్యత్తును నేను చూసుకుంటాను

    వారి భవిష్యత్తును నేను చూసుకుంటాను

    అయితే పునీత్ రాజ్ కుమార్ 1,800 మంది పిల్లలను చదివించారు అనగానే నాకు ఎంతగానో ఆనందంగా అనిపించింది. అయితే ఇప్పుడు వారి భవిష్యత్తుకు సహాయంగా నేను చేయాల్సింది చేస్తాను. తప్పకుండా వచ్చే ఏడాది నుంచి వారి భవిష్యత్తును బాధ్యతగా తీసుకొని వారికి చదువులకు అవసరమయ్యే ఏర్పాట్లను నేను చూస్తాను అని హామీ ఇస్తున్నాను. ఇలాంటి సమయంలో ఈ విధంగా ఈవెంట్ పెట్టడం కరెక్ట్ కాకపోవచ్చు. అయినప్పటికీ అలాంటి మంచి వ్యక్తి మంచి పనిలో కొన్ని పనులను అయినా తాను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు విశాల్ వివరణ ఇచ్చాడు

    English summary
    Hero vishal good decision foe Puneeth rajkumar free education trust
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X