ట్వీట్ చేసి తన లవ్ మ్యాటర్ పబ్లిక్ చేసిన విశాల్...

By Bojja Kumar

హైదరాబాద్: గత కొన్నేళ్లుగా విశాల్ ప్రేమ వ్యవహారం మీడియాలో తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మితో విశాల్ ప్రేమ వ్యవహారం గురించి దాదాపు సౌత్ లో ప్రతి ఒక్కరూ వినే ఉంటారు.

అయితే ఇన్నాళ్లు ఈ మ్యాటర్ కేవలం గాసిప్ గానే ఉంది. అటు విశాల్ గానీ, ఇటు వరలక్ష్మి గానీ ఎప్పుడూ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే విషయాన్ని ఇద్దరూ పలు ఇంటర్వ్యూల్లో ఖండించారు కూడా. అయితే మీడియాలో ఈ విషయమై గాసిప్స్ వినిపిస్తూనే వచ్చాయి.

వీరి వివాహానికి వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోలేదని.... ఆ కోపంతోనే విశాల్ నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి శరత్ కుమార్ ను ఓడించారనే ఓ వాదన కూడా ఉంది. వీరి మధ్య తీవ్రస్థాయిలో వార్ జరుగడానికి కారణం వరలక్ష్మి మ్యాటరే అని చాలా మంది భావన.

బయట ప్రచారం ఎలా ఉన్నా... విశాల్ మాత్రం ఎప్పుడూ ఈ విషయం గురించి మాట్లాడేవాడు కాదు. ఎట్టకేలకు విశాల్ తాజాగా ఓ ట్వీట్ చేసారు. వరలక్ష్మితో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోను పోస్టు చేసారు. ఈ ఫోటో అన్ని చెబుతుంది అంటూ కామెంట్ పెట్టాడు.

విశాల్ నేరుగా చెప్పక పోయినా.... ఈ విధంగా తన లవ్ మేటర్ పబ్లిక్ చేసాడని అంటున్నారంతా. కొందరు అభిమానులు ఈ విషయమై విష్ చేస్తూ..... వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని సెటిలవ్వాలంటూ విష్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X