»   » శ్రీరెడ్డి దుమ్ముదులిపిన హీరో విశాల్.. నానికి మద్దతు.. నా పేరు కూడా..!

శ్రీరెడ్డి దుమ్ముదులిపిన హీరో విశాల్.. నానికి మద్దతు.. నా పేరు కూడా..!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Vishal Responds On Sri Reddy Comments Over To Nani

  నేచురల్‌ స్టార్ నాని, ఇతర తెలుగు హీరోలపై చవకబారు ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారంపై తమిళ నటుడు విశాల్ స్పందించారు. ఇప్పుడు నాని పేరు శ్రీరెడ్డి చెప్పారు. ఇలాగే నోరు మూసుకొని కూర్చొంటే ఇంకా ఎవరిపైనైనా బురద జల్లడానికి వెనుకాడరు అని ఆయన తీవ్రంగా స్పందించారు. శారీరకంగా వాడుకొని మోసం చేశారని ఇటీవల సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి వివాదంపై విశాల్ స్పందించారు.

  నానికి మద్దతుగా విశాల్

  నానికి మద్దతుగా విశాల్


  శ్రీరెడ్డి ఆరోపణల నేపథ్యంలో నానికి విశాల్ మద్దతుగా నిలిచారు. నాని గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆయన నాకు మంచి స్నేహితుడు. వ్యక్తిగతంగా ఉండే రిలేషన్స్ కారణంగా ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. మహిళల పట్ల నాని ఎలా వ్యవహరిస్తారనేది అందరికీ తెలుసు అని విశాల్ అన్నారు.

  ఆధారాలు లేకుండా ఆరోపణలా

  ఆధారాలు లేకుండా ఆరోపణలా

  ఎవరిపైనైనా ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో బయటకు రావాలి. శ్రీరెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శిస్తున్నారు. గుడ్డిగా ఏదో ఒకరిని టార్గెట్‌గా చేసుకొంటున్నారని నాకు అనిపిస్తున్నది. ఇలానే కొనసాగితే ఆమె నా పేరు కూడా వాడుకోదన్న గ్యారెంటీ ఏమిటి అని నాని తీవ్రంగా స్పందించారు. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ఠ దెబ్బ తింటున్నది అని అన్నారు.

  అవాస్తవాలతో బురద జల్లుతారా?

  అవాస్తవాలతో బురద జల్లుతారా?

  ఒకరిపై ఆరోపణలు చేస్తున్నామంటే వాటికి ఆధారాలు ఉండాలి. అవాస్తవాలతో ఎవరిపైనైనా బురద జల్లవచ్చు. ఆమె నోటి నుంచి ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియని పరిస్థితి, ఆందోళన వ్యక్తమవుతున్నది. లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలలో కొన్ని అసమానతలు ఉన్నాయి.

  చట్టాల్లో అసమానతలు

  చట్టాల్లో అసమానతలు

  ప్రస్తుత చట్టాల ప్రకారం ఏ మహిళైనా ఎవరిపైనైనా ఆరోపణలు చేయవచ్చు. వాటి ఆధారంగా చట్టాలు పనిచేసుకొంటూ పోతాయి. పురుషులకు తమను తాము కాపాడుకోవడానికి, తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి కూడా అవకాశాలు లేవు. అది సరికాదు అని విశాల్ అభిప్రాయపడ్డారు.

  క్యాస్టింగ్ కౌచ్ ఉంది

  క్యాస్టింగ్ కౌచ్ ఉంది

  సినీ, వినోద రంగంలో క్యాస్టింగ్ కౌచ్ (వేషాల కోసం మహిళలను శారీరకంగా వాడుకోవడం) సమస్య ఉంది. ఊరు, పేరు తెలియని వ్యక్తులు ఆఫీస్ తెరిచి నేను నిర్మాతను, నేను దర్శకుడిని అనిచెప్పి వేషాల కోసం వచ్చేవారిని ఆడిషన్స్ చేస్తున్నారు. అలా వచ్చే అమ్మాయిలను వాడుకొంటున్నారు. ఇది తెలుగు, తమిళ పరిశ్రమలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.

  అమాయక మహిళలు టార్గెట్

  అమాయక మహిళలు టార్గెట్

  నిర్మాతలు, దర్శకుల పేర్లు చెప్పుకొని వారి సహాయకులు అమ్మాయిలను వేధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి చర్యలను అడ్డుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నాం అని విశాల్ వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు కేవలం సినీ రంగానికి పరిమితం కాలేదని, ఇతర రంగాల్లో కూడా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  English summary
  Tamil-Telugu actor Vishal Krishna, currently riding the crest of success with his digital hit Irumbu Thirai is embarrassed and appalled by actress Sri Reddy's naming game. He says if she can name Telugu superstar Nani, she can name anyone next. Vishal, jumping to Nani's defence, said, "I know him well. He is a very good friend of mine. But I am not defending him for personal reasons. This latest accusation by her (Sri Reddy) is perhaps the most outrageous yet. Anybody who knows Nani knows how particular he is in his behaviour towards men and women."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more