For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హీరోలు నష్టపోతున్నారు, వారికి ఆ మాత్రం ఇవ్వడం సబబే: అనుష్క

  By Bojja Kumar
  |

  ఏ భాషకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ అయినా.... రెమ్యూనరేషన్ అందుకోవడంలో హీరోలదే పైచేయి. కథా నాయకులతో పోలిస్తే కథానాయికల రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వారు అందుకునే రెమ్యూనరేషన్లో మూడో వంతు కూడా హీరోయిన్లకు అందడం లేదనే విమర్శ ఉంది. దీనిపై కొందరు తారలు గతంలో పలు సందర్భాల్లో అసంతృప్తి సైతం వ్యక్తం చేశారు. అయితే సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క మాత్రం ఈ విషయంలో భిన్నంగాస్పందించారు.

  సబబే అంటున్న అనుష్క

  సబబే అంటున్న అనుష్క

  ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుష్క... చిత్ర పరిశ్రమలో కథానాయికల కన్నా కథానాయకులకు ఎక్కువ పారితోషికం ఇవ్వడం గురించి తన అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పారు. హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్ధించారు.

  హీరోలు నష్టపోతున్నారు

  హీరోలు నష్టపోతున్నారు

  ‘ఏ వృత్తిలో అయినా పనిని బట్టి పారితోషికం ఉంటుంది. ఒక సినిమాకు సంబంధించి హీరోలపై ఎక్కువ భారం ఉంటుంది. శ్రమ విషయంలో అయినా, కష్టపడే విషయంలో అయినా ఎక్కువ నష్టపోతుంటారు, కాబట్టి వారికే ఎక్కువ పారితోషికం ఇస్తారు..... అని అనుష్క అభిప్రాయ పడ్డారు.

  అలా ఫైట్ చేయడం కంటే దీనిపై దృష్టి పెడదాం

  అలా ఫైట్ చేయడం కంటే దీనిపై దృష్టి పెడదాం

  హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఎందుకు ఇవ్వడం లేదు అనే అంశంపై పోరాటం చేయడం కన్నా.... కథానాయికల కోసం ఉత్తమ కథలు రాసి, వారిని శక్తిమంతమైన పాత్రల్లో చూపించడంపై దృష్టి పెడితే బావుంటుందని అనుష్క అభిప్రాయ పడ్డారు.

  ఆలా ఆలోచించడం మానేయండి

  ఆలా ఆలోచించడం మానేయండి


  ఈ మధ్య కాలంలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. ఇండియన్ సినీమాలో ఫిమేల్ యాక్టర్లకు మంచి రోజులు నడుస్తున్నాయని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు అనుష్క స్పందిస్తూ..... ఫిమేల్ సెంట్రిక్, మేల్ సెంట్రిక్ సినిమాలు అని ఆలోచించండం మానేయాలి. ప్రధాన పాత్రలో ఆడ, మగ ఎవరు ఉన్నా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి, ఎంటర్టెన్మెంట్ అందించడానికి కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి అని అనుష్క వెల్లడించారు.

  ప్రభాస్‌తో అలాంటి సంబంధం లేదు

  ప్రభాస్‌తో అలాంటి సంబంధం లేదు

  ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.... ప్రభాస్‌ నాకు మంచి స్నేహితుడు. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. నా పెళ్లి గురించి ప్రజలు ఎనలేని ఆసక్తి చూపుతున్నందుకు సంతోషంగా ఉంది. నాకు తగిన వరుడు దొరికితే పెళ్లి చేసుకుంటాను. ఇందుకోసం ఎంతకాలం అయినా వెయిట్ చేస్తాను అని అనుష్క చెప్పుకొచ్చారు.

  భాగమతి సినిమా గురించి

  భాగమతి సినిమా గురించి

  ‘భాగమతి' చిత్రంలో నేను సంచల అనే ఐఏఎస్‌ అధికారిణి పాత్రలో నటిస్తున్నాను. ఓ ఐఏఎస్‌ అధికారిణి ‘భాగమతి'గా ఎలా మారింది? అన్నదే ఈ సినిమా కథ... అని అనుష్క వెల్లడించారు.

  ఐదేళ్ల క్రితమే కథ చెప్పాడు

  ఐదేళ్ల క్రితమే కథ చెప్పాడు

  దర్శకుడు అశోక్‌ ఈ సినిమా కథను 2012లోనే చెప్పారు. కానీ అప్పటికే నేను ‘లింగా', ‘సైజ్‌ జీరో', ‘బాహుబలి 1', ‘బాహుబలి 2' సినిమాలతో బిజీగా ఉండటం వల్లే చేయలేక పోయాను అని అనుష్క వెల్లడించారు.

  భాగమతి అలాంటి కథ కాదు

  భాగమతి అలాంటి కథ కాదు

  భాగమతి మూవీ కల్పిత కథ మాత్రమే, భాగమతి చరిత్రకు, దీనికి ఎలాంటి సంబంధం లేదు. స్క్రిప్టు నచ్చడంతో పాటు, యూవీ క్రియేషన్స్‌ వారి నిర్మాణం వల్లే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని అనుష్క తెలిపారు.

  కమిటైతే ప్రాణం పెడతా

  కమిటైతే ప్రాణం పెడతా


  నాకు స్క్రిప్టు బాగా నచ్చితేనే చేయడానికి ఒప్పుకుంటాను. ఏదైనా సినిమాకు కమిటైతే ప్రాణం పెట్టి చేస్తాను. ‘సైజ్‌ జీరో' కోసం చాలా బరువు పెరిగిపోయాను. తర్వాత ఇతర సినిమాల కోసం బరువు తగ్గాను.... అని అనుష్క తెలిపారు.

  నెక్ట్స్ మూవీ ఎవరితో

  నెక్ట్స్ మూవీ ఎవరితో


  త్వరలో గౌతమ్‌ మేనన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. త్వరలోనే అందుకు సంబంధించి వివరాలు వెల్లడిస్తాను అని అనుష్క తెలిపారు. ఉంది.'

  English summary
  "In any profession, one needs to earn it to be paid more. Heroes are paid more because they have a lot to lose. A lot of films ride on their shoulders and I think they deserve better pay scale. Instead of fighting for better pay scale, why not write better stories for women and showcase them in stronger roles." Anushka said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more