»   » హీరోయిన్ అంకిత పెళ్లి ఫిక్స్‌!(ఎంగేజ్మెంట్ ఫోటోస్)

హీరోయిన్ అంకిత పెళ్లి ఫిక్స్‌!(ఎంగేజ్మెంట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఐ లవ్‌ యూ రస్నా... అంటూ రస్నా బేబీగా అందరికీ తెలిసిన అంకిత ‘లాహిరి లాహిరి లాహిరి'లో చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై ‘ప్రేమలో పావని కళ్యాణ్‌, ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ, సింహాద్రి, విజయేంద్రవర్మ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో తన నటనతో, తన గ్లామర్‌తో హీరోయిన్‌గా తనకంటూ ఓ స్పెషల్‌ ఐడెంటిఫికేషన్‌ తెచ్చుకుంది.

Heroine Ankitha Got Engaged

అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చిన అంకిత సడన్‌గా యు.ఎస్‌. షిఫ్ట్‌ అయింది. సినిమా టెక్నాలజీకి సంబంధించిన కోర్స్‌ను యూనివర్సల్‌ స్టూడియోలో చేసింది. కొందరు హాలీవుడ్‌ డైరెక్టర్స్‌ దగ్గర అసిస్టెంట్‌గా కూడా వర్క్‌ చేసింది. సినిమా టెక్నాలజీ నేర్చుకోవాలన్నా ఉత్సాహం వెనుక ఫ్యూచర్‌లో డైరెక్టర్‌ అవ్వాలన్న ఉద్దేశం వుందో ఏమో తెలీదుగానీ, ఇప్పుడు మాత్రం పెళ్ళికి రెడీ అయింది.

Heroine Ankitha Got Engaged

న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన విశాల్‌ జగ్తాప్‌ను పెళ్ళాడబోతోంది. ఈరోజు(నవంబర్‌ 6) ఉదయం ముంబైలోని జె.పి. మారియట్‌ హోటల్‌లో పెద్దల సమక్షంలో అంకిత, విశాల్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

English summary
Tollywood actress Ankitha Got Engaged To Vishal. Ankitha acted almost all the crazy superstars of Tollywood like Jr NTR,Nandamuri Balakrishna and other star heroes of Telugu,Tamil and Kannada.
Please Wait while comments are loading...