»   » బాలకృష్ణ డైలాగులతో ...హీరోయిన్ డంబ్‌ స్మాష్‌ (వీడియో)

బాలకృష్ణ డైలాగులతో ...హీరోయిన్ డంబ్‌ స్మాష్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రీసెంట్ గా ఓ కొత్త ఒరవడి మొదలైంది. సోషల్ నెట్ వర్కింగ్ ప్రియుల కోసం వచ్చిన కొత్త సాధనం 'డంబ్‌ స్మాష్‌'. దీన్ని ఉపయోగించి సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన సంభాషణలకు తమ ముఖాన్ని అరువిచ్చి చిన్న చిన్న వీడియోలు రూపొందించొచ్చు.బాలీవుడ్‌లో ఈ ఆప్‌కు మంచి స్పందన వస్తోంది. టాలీవుడ్ కూ ఇది పాకింది.

మొన్న పోకిరిలో డైలాగులతో మహేష్ తన కొడుకుగౌతమ్ వీడియోని వదిలారు. తర్వాత దర్శకుడు సుకుమార్ తన కుమారుడు వీడియోని విడుదల చేసారు. తాజాగా రామ్ చరణ్, రానా కలిసి మగధీర లోని డైలాగుతో కలిసి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. అలాగే ఇప్పుడు మాధవి లత..బాలకృష్ణ డైలాగులను చెప్తూ... వీడియోని విడుదల చేసింది. మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.

Balayya ki Fans aithe ???Racha racheeeee hahahahaha lol rofllFunnnn funn with dubsmash

Posted by Actress Maadhavi on 30 June 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మాధవి లత తాజా చిత్రం విషయానికి వస్తే...

తన వినులవిందైన గజల్ గానంతో శ్రోతలను సమ్మోహితుల్ని చేసి... గజల్ నే ఇంటి పేరుగా మార్చుకున్న గాయకుడు గజల్ శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్ హీరోగా అనుష్ఠానం చిత్రం తెరకెక్కుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఆ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. గజల్ శ్రీనివాస్ సరసన మాధవి లత నటిస్తున్నారు.

Heroine Madhavi Latha's Dubsmash

భార్యాభర్తల మధ్య నెలకొన్న సున్నితమైన అంశాలే ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 1950లో ప్రముఖ కవి గుడిపాటి వెంకటాచలం రచించిన 'అనుష్టానం' కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వాసా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అనుష్టానానికి స్వరాలు కూడా దర్శకుడు కృష్ణ అందిస్తున్నారు.

English summary
Enjoy the tollywood heroin madhavi latha did dubsmash.
Please Wait while comments are loading...