»   » ప్రభాస్‌ను పెళ్లాడతానంటున్న హీరోయిన్!

ప్రభాస్‌ను పెళ్లాడతానంటున్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిర్లలో ప్రభాస్ ఒకరు. ఆయన పెళ్లి గురించి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇన్నాళ్లు బాహుబలి ప్రాజెక్ట్ కోసం తన పెళ్లిని వాయిదా వేసిన ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ పూర్తయినా....పెళ్లి విషయంలో మాత్రం ఏ మాత్రం తొందర పడపటం లేదు.

ఆసంగతి పక్కన పెడితే ప్రభాస్ సై అంటే పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ ప్రభాస్ మీద ఉన్న క్రష్ ను బయట పెట్టింది. ఆవిడ మరెవరో కాదు 'ద్వారక' సినిమాలో నటించిన హీరోయిన్ పూజా జవేరి.

ప్రభాస్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం

ప్రభాస్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం

ద్వారక సినిమా ప్రమోషన్లో పాల్గొన్న పూజా జవేరి ఈ సందర్భంగా తనకు ఎదురైన ఓ ప్రశ్నకు స్పందిస్తూ... ప్రభాస్ ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమంటూ తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టింది.

ప్రభాస్ పెళ్లి సంగతి ఏమైంది?

ప్రభాస్ పెళ్లి సంగతి ఏమైంది?

ప్రభాస్ కు ఇంట్లో వారు కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. ఓ అమ్మాయి కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాలను అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లాడబోయే అమ్మాయి గోదావరి జిల్లాలకు చెందిన అమ్మాయని టాక్.

కృష్ణం రాజు చెప్పినట్లు జరగట్లేదే?

కృష్ణం రాజు చెప్పినట్లు జరగట్లేదే?

బాహుబలి సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని... సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నెక్ట్స్ మూవీ మొదలవ్వడానికి ముందే పెళ్లి తంతు ముగుస్తుందని ఆ మధ్య కృష్ణం రాజు తెలిపారు. అయితే ఆ సినిమా మొదలైనా ప్రభాస్ పెళ్లి విషయంలో ఇంకా ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాలేదు.

రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ కొత్త మూవీ

రూ. 150 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ కొత్త మూవీ

దాదాపు మూడున్నరేళ్లుగా'బాహుబలి' ప్రాజెక్టే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.... ఆ సినిమా షూటింగ్ పూర్తవడంతో అందులో నుండి బయటకు వచ్చి ఇతర సినిమాలపై దృష్టి సారించారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tollywood Young Heroine Pooja Jhaveri during interview of dwaraka movie she said that she had a crush on prabhas and Wants To Marry him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu