»   » దర్శకుడుతో ఎఫైర్ పై నోరు విప్పిన హీరోయిన్

దర్శకుడుతో ఎఫైర్ పై నోరు విప్పిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రవిబాబు గారితో ఎఫైరంటూ వస్తున్న ఈ వార్తలను నేనూ విన్నాను. ఆయన దర్శకత్వంలో వరుసగా మూడు సినిమాలు చేయడం వల్ల ఈ రకమైన పుకార్లను సృష్టిస్తున్నారు. నటీనటులకు రవిబాబు మంచి గౌరవాన్ని ఇస్తారు. తన పని తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు. సినిమా షూటింగ్ సమయంలో ఆయనతో మాట్లాడింది చాలా తక్కువ.

షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. అయినా ఒక హీరో, హీరోయిన్ కలిసి కొన్ని సినిమాల్లో నటిస్తే వారి మధ్య సంబంధం ఉందని అనుకుంటే ఎలా?. ఇలాంటి గాసిప్స్‌ను నేను పెద్దగా పట్టించుకోను. వాటిని చూసి నవ్వుకుంటాను అంటూ వివరించింది.

Heroine Poorna Denies Romantic Involvement with Ravi Babu

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే ...రవిబాబు వైవిధ్యం కోసం నిరంతరం తపిస్తుంటారు. ఆయన సినిమాలు, ఆలోచన విధానం ఢిఫరెంట్‌గా ఉంటాయి. కథ, కథనాలతో పాటు షూటింగ్, నటీనటులు ఎంపికలో చాలా ప్లానింగ్‌తో ఉంటారు. లడ్డుబాబు, అవును, అవును-2 చిత్రాల్లో నా పాత్రల్ని కొత్తగా తీర్చిదిద్దారు. ఆయన సిద్ధం చేసే కథలకు నేను సరిపోతుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారామె.

ఇక అశ్లీలతకు తావులేకుండా హద్దులు దాటని అందాల ప్రదర్శనకు నేను సిద్ధమే. అయితే ఎక్కువగా చీరలోనే కనిపించటానికి ప్రాధాన్యమిస్తాను. నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నన్ను నేను చూసుకోవడానికి ఇష్టపడతాను. గ్లామర్ పేరుతో హద్దులు దాటడం నాకు నచ్చదు.

మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటించాను. అది ఐటెంసాంగ్ కాదు. సినిమాలో ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే గీతమది. అందులో సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తాను. అవకాశం లభిస్తే అరుంధతి లాంటి సినిమా చేయాలని ఉంది అని చెప్పుకొచ్చారామె.

English summary
Poorna revealed that she has been hearing many rumors and clarified that just because she has worked in three of his films, there is no such affair between them and that they share a strictly professional relationship.
Please Wait while comments are loading...