»   »  హాస్పటల్ పాలైన స్టార్ హీరోయిన్(ఫొటోలు)

హాస్పటల్ పాలైన స్టార్ హీరోయిన్(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ హాస్పటల్ లో చేరింది. ఆమె తాజా చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో షూటింగ్ ఎన్ డి స్టూడియోలో జరుగుతోంది. ఈ లోగా ఆమెకు చాలా అనీజీగా ఉన్నట్లు ఫీలై,కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటంతో దగ్గరలో ఉన్న ప్రెవేట్ హాస్పటిల్ కి తీసుకు వెళ్లారు.

Heroine Sonam Kapoor hospitalised!

ఆమెను పరీక్షించిన డాక్టర్స్ ఆమె రెస్పెక్టరీ ఇన్ ఫెక్షన్ తో భాధపడుతోందని అన్నారు. అది ఆస్మా ఎటాక్ లాంటిదని వివరించారు. ఆమెను రెండు రోజులు ట్రీట్ చేసి సోమవారం రిలీవ్ చేసారు. మరికొద్ది రోజులు ఆమె రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆమె తాను సిక్ గా ఉన్నట్లు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియచేసింది. ఈ ఫొటోలను ఆమె అప్ లోడ్ చేసి, తను సిక్ గా ఉండటాన్ని హేట్ చేస్తానని అంది.

Heroine Sonam Kapoor hospitalised!

ఇక ఆ మధ్యన ముంబై రక్షణ ఉందని, డిల్లీ లేదంటూ కామెట్స్ చేసి వార్తలకి ఎక్కిందీమె. దేశ రాజధానిలో ఇటీవల ఓ యువతిపై టాక్సీ డ్రైవర్‌ లైంగిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బాలీవుడ్‌ తార సోనమ్‌ కపూర్‌, మహిళలకు ఢిల్లీ కంటే ముంబై సురక్షితమని తెలిపింది. గత శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని వసంత్‌ విహార్‌ ప్రాంతం వద్ద ఉబర్‌ కంపెనీకి చెందిన క్యాబ్‌ ఎక్కిన 25 ఏళ్ల యువతిని ఆ క్యాబ్‌ డ్రైవర్‌ అత్యాచారం చేశాడనేది ఆరోపణ. దీంతో రాజధానిలో ఉబర్‌ కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం తన సినిమా ‘ఖూబ్‌సూరత్‌' డీవీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్‌ ఈ ఘటనపై స్పందించింది.

‘‘జరిగింది దారుణం. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో మహిళలు అంత సురక్షితం కాదు. నిజాయితీగా చెప్పాలంటే, ఇందులో ఆ క్యాబ్‌ కంపెనీ తప్పేమీ లేదు. చాలా రకాలుగా ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ఎందుకంటే ఆ క్యాబ్‌ డ్రైవర్‌కు క్యారెక్టర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది వాళ్లే. అందువల్ల ప్రభుత్వం వైపు నుంచి శిక్షలు, నిబంధనలు మరింత కఠినతరం కావాలి. ఒకవేళ ప్రజా రవాణా వాహనంలో అత్యాచారం జరిగితే, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రభుత్వం నిషేధిస్తుందా?'' అంటూ ప్రశ్నించింది సోనమ్‌.

English summary
Actress Sonam Kapoor, who was recently seen in Arbaaz Khan's Dolly Ki Doli, has been hospitalized. The actress shared an image from the hospital on microblogging site Twitter saying that she hates being sick.
Please Wait while comments are loading...