For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒక్కో హీరో గురించి తమన్నా ఒక్కో రకంగా..(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : తమన్నా చాలా ప్రొఫెషనల్‌... అంటుంటారు ఆమెతో పనిచేసిన దర్శకులు. తమన్నా కూడా అంతే. సెట్లోనూ, బయటా అదే అంకితభావం ప్రదర్శిస్తుంటుంది. 'ఆగడు', 'ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌,' 'నాన్‌బెందా' , 'బాహుబలి'అంటూ మూడు భాషల సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తోంది తమన్నా. 'ఆగడు'లో మహేష్‌ బాబు సరసన నటించింది తమన్నా. ఈమె నటిస్తున్న 'బాహుబలి' చిత్రీకరణ దశలో ఉంది.

  హిట్...ఫ్లాపులకు సంభంధం లేకుండా ఆమెను ఇండస్ట్రీలు ఆదరిరస్తున్నాయి. ఆమె వృత్తి పట్ల కనపడిచే క్రమ శిక్షణ, నటనాశక్తి ఆమెను ఈ స్ధాయికి తీసుకు వచ్చాయంటూంటారు. తెలుగులో మంచు మనోజ్ సరసన శ్రీ చిత్రంలో ఆమె లాంచ్ అయినా సక్సస్ రాలేదు. తర్వాత దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకుని చేసిన శేఖర్ కమ్ముల చిత్రం హ్యాపీ డేస్ తో ఆమె కుర్రకారు గుండెళ్లోకి దూసుకుపోయింది. తర్వాత హండ్రెడ్ పర్శంట్ లవ్ వంటి చిత్రాలు విజయం ఆమెకు కెరీర్ లో లాంగ్ స్టాండింగ్ వచ్చేలా చేసాయి.

  ప్రస్తుతం తమన్నా... ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి'లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభాస్‌, అనుష్క, రానా, సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బాహుబలి'. ప్రస్తుతం తమన్నా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది.

  ఈ నేపధ్యంలో తెలుగులో తనతో కలిసి నటించిన హీరోల గురించి నాలుగు మాటలు చెప్పమంటే... ఇలా టకటకా చెప్పేసింది. అలాగే బాహుబలి గురించీ, తన కుటుంబం గురించీ చాలా చెప్పుకొచ్చింది. అలాగే చిరకాల స్వప్నం నిజమైతే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు తమన్నా అలాంటి ఆనందాన్ని అనుభవిస్తోంది. బాహుబలి సెట్స్‌ మీద ఉంటే ఆమెకు ఆకలి కూడా వేయట్లేదట.

  స్లైడ్ షోలో ఆ వివరాలు

   హీరో రామ్ గురించి...

  హీరో రామ్ గురించి...

  రామ్‌ ఎనర్జీతో పోటీపడటం చాలా కష్టం. సినిమా అంటే అతనికి చాలా ఇష్టం. ప్రతి సన్నివేశం గురించీ తనకంటూ ఓ సొంత అభిప్రాయం ఉంటుంది. ఆ విధంగా చేస్తే ఎలా ఉంటుందని దర్శకుడి దగ్గర ప్రస్తావిస్తుంటాడు. రామ్‌కు వయసుకు మించిన తెలివితేటలూ, ప్రతి విషయంపైనా అవగాహనా ఉన్నాయని నా అభిప్రాయం. 'స్క్రీన్‌పైన మన జోడీ బాగా కుదరాలంటే తెరవెనక కూడా మనం స్నేహంగా మెలగాలి' అంటూ తెగ మాట్లాడిస్తాడు.

  అల్లు అర్జున్ గురించి...

  అల్లు అర్జున్ గురించి...

  తోటి నటులకు సాయం చేయడంలో అల్లు అర్జున్‌ ఎప్పుడూ ముందుంటాడు. బద్రినాథ్‌ షూటింగ్‌ తొలిరోజు అర్జున్‌ను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. అంతకు ముందు 'వేదం' సమయంలో చాలా సాధారణంగా కనిపించాడు. కానీ కాస్త వ్యవధిలోనే శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్న తీరు చూసి ఆశ్చర్యమేసింది. సినిమా అంటే ఎంతో ప్రేమ ఉంటే తప్ప అలా చేయడం సాధ్యం కాదు. నా బెస్ట్‌ డాన్స్‌ 'బద్రినాథ్‌' సినిమాలో 'నాథ్‌ నాథ్‌' పాటలో కనిస్తుందని అందరూ అంటారు. మొదట నాకు ఆ స్టెప్స్‌ వేయడం రాక కొరియోగ్రాఫర్‌ని వాటిని మార్చమని అడిగా. కానీ అర్జునే డాన్స్‌లో మెలకువలు చెప్పి నాతో ఆ స్టెప్స్‌ వేయించాడు.

  హీరో సూర్య గురించి...

  హీరో సూర్య గురించి...

  పక్కా జెంటిల్‌మెన్‌ అనగానే సూర్య గుర్తొస్తాడు. అంత మంచి కుటుంబ నేపథ్యం, స్టార్‌డమ్‌ ఉన్నా చాలా ఒద్దికగా ఉంటాడు. అతడు ఎంచుకునే పాత్రలను చూస్తేనే తనను తాను నిరూపించుకోవడానికి ఎంత తాపత్రయ పడతాడో అర్థమవుతుంది. సెట్స్‌ పైన కూడా పలకరిస్తేనే మాట్లాడతాడు. లేదంటే ఒక్కడే తన సన్నివేశాలను సాధన చేస్తుంటాడు. సినిమాలను పక్కనపెడితే అతని వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుంది. సెట్స్‌కి ఎవరైనా అభిమానులొచ్చినప్పుడు వాళ్లతో అతడు మాట్లాడే తీరుని చూసి నేను చాలా నేర్చుకున్నా.

  నాగ చైతన్య

  నాగ చైతన్య

  చైతన్యతో రెండు సినిమాలు చేశాను. అయినా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా అతడు నాతో కలిసి భోజనం చేయలేదు. దానికి కారణం చైతన్యకు బయటి ఆహారం తినే అలవాటు లేకపోవడమేనట. ఆరోగ్యానికీ, ఫిట్‌నెస్‌కూ అతను చాలా ప్రాధాన్యం ఇస్తాడు. అందరూ భోజనం చేసే సమయంలో ఓ అరగంట నిద్రపోతాడు. అదీ మొదట్నుంచీ ఉన్న అలవాటే. మధ్యాహ్నం కాసేపు పడుకుంటేనే షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనగలనని చెబుతుంటాడు. చైతూని చూశాకే నాకూ వ్యక్తిగత ఆరోగ్యంపైన శ్రద్ధ పెరిగింది.

  పవన్ కళ్యాణ్ గురించి..

  పవన్ కళ్యాణ్ గురించి..

  అభిమానులకు పవన్‌ కల్యాణ్‌ అంటే ఎందుకంత ఇష్టమో కలిసి నటించాకే తెలిసింది. సెట్స్‌లో అయినా బయటైనా తను తనలానే ఉంటాడు. ఎవరికోసమూ శైలిని మార్చుకోడు. ఏదైనా నచ్చకపోతే నిక్కచ్చిగా చెప్పేస్తాడు. కానీ దర్శకుడు షాట్‌ చెప్పేసరికి తన పద్ధతులని పక్కనపెట్టి కెమెరా ముందుకొస్తాడు. బయట మౌనంగా కనిపించే వ్యక్తి, కెమెరా ముందు నటించే తీరుని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. 'కెమెరామెన్‌ గంగతో...'లో ఆయన పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. ఆయన నటనను చూసి ఒక్కోసారి నాకే భయమేసేది. అంతలా పాత్రను సొంతం చేసుకుంటాడు.

  సిద్దార్ద గురించి..

  సిద్దార్ద గురించి..

  సిద్ధార్థ్‌ సినిమా మాధ్యమాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి. తెరవెనుక చాలా కాలం పనిచేసిన అనుభవం, నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తన పైన చిత్రీకరణ ఉన్నా లేకున్నా, ప్రతి సన్నివేశాన్నీ జాగ్రత్తగా గమనిస్తూ సలహాలిస్తుంటాడు. కనిపించగానే తనే వచ్చి పలకరించే తీరు నాకు నచ్చుతుంది. ఒక్కసారి కూడా సిద్ధూ డల్‌గా ఉండటం చూడలేదు.

   మహేష్ గురించి...

  మహేష్ గురించి...

  మహేష్ తో పనిచేయటం ఓ అద్బుతం...ఆయన సూపర్ స్టార్ అని ఎందుకంటారో పనిచేస్తేనో అర్దమవుతుంది. ఆయనకు ఆయన పని తప్ప వేరేదేమో పట్టదు. తోటి నటులతో చాలా గౌరవంగా ఉంటారు. ఆయన దృష్టి మొత్తం దర్శకుడు ఏం చెప్తాడో...స్క్రిప్టుని ఇంకా ఎంత బాగా చెయ్యవచ్చు అనేదాని మీదే..

  ఎన్టీఆర్...

  ఎన్టీఆర్...

  ఎన్టీఆర్ మంచి డాన్సర్...ఆయనతో డాన్స్ సన్నివేశాలు అంటేనే భయం వేస్తుంది. ఆయన వేసే స్టెప్స్ కు పోటీ పడగలమా అనిపిస్తుంది. అది గమనించి ఆయన తోటి ఆర్టిస్టులకు సహకరించి మంచి అవుట్ పుట్ లా చేస్తారు

  కార్తీ

  కార్తీ

  కార్తీ తో నేను తమిళంలో హిట్ పెయిర్ అవటం మూలానో ఏమో కానీ మా గురించి రకరకాల రూమర్స్ వచ్చేవి. మేం తెగ నవ్వుకునేవాళ్లం. ఇప్పుడు అతనికి పెళ్లై పోయింది కాబట్టి నో ప్లాబ్లం... అతను తెరమీద ఎలా ఉంటాడో తెర వెనకా అలాగే జెంటిల్ గా బిహేవ్ చేస్తాడు.

  రామ్ చరణ్

  రామ్ చరణ్

  రచ్చ సినిమా కోసం మేమిద్దరం కలిసిపనిచేసాం. రామ్ చరణ్ కి డెడికేషన్ ఎక్కువ. అలాగే అంత మెగా స్టార్ కుమారుడైనా ఆ క్రమశిక్షణ..అందరికంటే ముందు సెట్స్ లో ఉండటం,దర్శకుడుకి ఇచ్చే గౌరవం వంటివి ఆశ్చర్యపరుస్తాయి.

  అక్షయ్ కుమార్

  అక్షయ్ కుమార్

  అక్షయ్ యాక్షన్ సన్నివేశాలు ఎంత ఈజ్ తో చేస్తాడో...అంతే ఈజ్ గా కామెడీనీ సైతం ఆయన సెట్స్ మీద పండించగలగటం చూస్తూంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయనలో మంచి నటుడే కాదు...మంచి మానవతావాది కూడా ఉన్నాడు. అక్షయ్ పనిచేయటం నా అదృష్టమనే చెప్పాలి.

  బాహుబలి గురించి...

  బాహుబలి గురించి...

  ‘‘మామూలుగా నేను మధ్యాహ్నం ఒంటిగంటకే భోజనం చేస్తాను. కానీ ‘బాహుబలి' సెట్స్‌ మీద ఉంటే నాకు ఆకలి వేయడం లేదు. తర్వాతి షాట్‌ను ఎలా కంపోజ్‌ చేశారో, ఎలా ఉండబోతోందో అనే ఆలోచనలతోనే కడుపు నిండుతోంది. ఒక విధమైన కుతూహలంతో ‘బాహుబలి' సెట్లో పనిచేస్తున్నాను'' అని ట్వీట్‌ చేసింది తమన్నా.

  పీకలోతు ప్రేమలో పడిపోయా

  పీకలోతు ప్రేమలో పడిపోయా

  ''మా నాన్నగారు వజ్రాల వ్యాపారం చేస్తారు. అన్నయ్య డాక్టరు. నేనేమో సినిమాల్లోకి వచ్చా. నాన్న, అన్నయ్య తమ వృత్తి పట్ల ఎంత క్రమశిక్షణతో ఉంటారో నేనూ అంతే. ఏ క్షణంలో సినిమాల గురించి ఆలోచించానో ఆక్షణం నుంచే సినిమాలపై పీకలోతు ప్రేమలో పడిపోయా. 'వృత్తే దైవం..' అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పను. నటన.. ప్రస్తుతానికి నా జీవితం. ఈ మత్తులో ఉన్నప్పుడు మరే విషయం పట్టించుకోను..'' అంది.

  అందుకోసం రాలేదు

  అందుకోసం రాలేదు

  ''సినిమాలంటే నాకు ఇష్టం. ఇక్కడికి డబ్బుకోసం, పరపతి కోసం రాలేదు. వాటి వెనుక పరుగుపెడితే నటించడం మానేస్తాం'' అని చెబుతోంది.

  English summary
  Tamanna said she is very happy to work with Tollywood Hero's. And she they are all gentle man.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X