»   » కిరణ్ రాధోడ్ 'హైస్కూల్' కు హైకోర్టు ఓకే

కిరణ్ రాధోడ్ 'హైస్కూల్' కు హైకోర్టు ఓకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

కిరణ్ రాధోడ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'హైస్కూల్' చిత్రానికి హైకోర్టు నిరభ్యంతరంగా ప్రదర్శించకోవచ్చునంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30 సంవత్సరాల లేడీ టీచర్ 14 సంవత్సరాల స్టూడెంట్ మధ్య చిగురించిన ప్రేమ ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేస్తూ క్రితం శుక్రవారం హైకోర్టు స్టే విధించింది. అయితే ఈ చిత్రంలో నిజంగా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయో లేదో స్వయంగా చూసి నిర్ణయించాలన్న డివిజన్ బెంచ్ నిర్ణయం మేరకు చిత్ర నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.చిత్రం వీక్షించిన అనంతరం హైస్కూల్ ప్రదర్శనపై స్టే ఆదేశాలను ఎత్తివేశారు. కిరణ్‌ రాథోడ్ ప్రధాన పాత్రలో ఐశ్వర్య ఫిలిమ్స్ పతాకంపై మల్లన్న నిర్మించిన 'హైస్కూల్' చిత్రం మలినా అనే ఇటాలియన్ చిత్రం ఆధారంగా రూపొందింది.

ఇక '1940లో ఒక గ్రామం' చిత్రంతో జాతీయ అవార్డు పొందిన యువ దర్శకుడు నరసింహ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రాన్ని ఓ మంచి సందేశాత్మక చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...అందరూ అనుకుంటున్నట్లు ఇది టీచర్, హైస్కూల్‌లో చదివే విద్యార్ధి మధ్య జరిగే ప్రేమకథ కాదు. ఇందులో కిరణ్ రాథోడ్ సాప్ట్ వేర్ ఇంజనీర్‌ గా నటించింది. ఆమెని అభిమానించే ఒక విద్యార్థి ఆమె ప్రభావంతో ఉన్నత స్థాయికి ఏవిధంగా చేరుకున్నాడన్నదే ఈ చిత్రకథ. మా సినిమాలో బూతు లేదు నీతి ఉంది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా మంచి సందేశంతో ఈ సినిమా తీశాం. ప్రతి తల్లితండ్రి చూడాల్సిన సినిమా ఇది. యువతరం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చూపించాం' అన్నారు. ఆయన వాదాన్ని సపోర్టు చేస్తున్నట్లుగా కోర్టు కూడా ఈ చిత్రంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి ధియోటర్లలో ఈ చిత్రం కంటెన్యూ అవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu