»   »  సల్మాన్‌ జైలు శిక్షపై హైకోర్టు స్టే

సల్మాన్‌ జైలు శిక్షపై హైకోర్టు స్టే

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Salman Khan
  రాజస్థాన్‌: వన్యప్రాణులను వేటాడిన నేరంపై బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు స్థానికకోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షపై రాజస్థాన్‌ హైకోర్టు స్టే విధించింది. 1998లో వన్యప్రాణులను వేటాడిన నేరంపై సల్మాన్‌ఖాన్‌కు 2006లో స్థానిక న్యాయస్థానం జైలుశిక్షవిధించింది. దీంతో బ్రిటన్ వీసా పొందేందుకు ఆయనకు అడ్డంకులు తొలిగిపోయారు.

  మరో ప్రక్క నాలుగేళ్లు కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వారు బ్రిటిన్ వీసా పొందేందుకు అనర్హులు. సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడినప్పటినుంచి ఆయనకు బ్రిటన్ దౌత్య కార్యాలయం వీసా నిరాకరిస్తూ వస్తోంది. క్రింద కోర్టు తీర్పుని హై కోర్టు నిలుపుద చేయటంతో తాజాగా బ్రిటన్ వీసాకు సల్మాన్ ధరాఖాస్తు చేయనున్నారు. తన దగ్గర ఉన్న బ్రిటన్ వీసా గడువు ఇటీవల ముగియటంతో క్రింది కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సల్మాన్ హై కోర్టుని ఆశ్రయించారు.

  ఇక సల్మాన్ పై ఉన్న కేసులు ఏమిటంటే... 1998లో రాజస్థాన్‌లో 'హమ్‌ సాత్‌ సాత్‌ హై' షూటింగులో ఉన్నప్పుడు ఆయన కృష్ణ జింకను వేటాడి చంపాడనే ఆరోపణలపై కేసు విచారణ జరుగుతోంది. 2002లో కారు వేగంగా నడిపి ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తిని ఢీకొని వారి మరణానికి కారణమయ్యారనే కేసుపైనా విచారణ సాగుతోంది. ఈ ఆరోపణలు నిరూపణైతే ఆయనకు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.

  సల్మాన్‌పై ఐపీసీ సెక్షన్లు 279 (నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనం నడపటం), 337, 338 , 427 వంటి అభియోగాలు మోపారు. వీటితోపాటు మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 34(ఎ), (బి) (వాహనం రిజిస్ట్రేషన్ రద్దు) రెడ్ విత్ 181 (నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడపటం), 185 (మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనం నడపటం), బోంబే ప్రొహిబిషన్ చట్టం కింద కూడా సల్మాన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ కోర్టుకు హాజరయ్యారు.

  అయితే తదుపరి విచారణకు తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కు కోర్టు అనుమతించింది. అవసరమున్నప్పుడు న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అనంతరం కేసు విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది. 2002 సెప్టెంబర్ 28న సబర్బన్ బాంద్రాలో సల్మాన్‌ఖాన్ నడుతుపున్న వాహనం.. ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

  English summary
  In a relief to Salman Khan, the Rajasthan High Court on Tuesday stayed the 2006 order of a lower court which had sentenced the actor to five years in jail for poaching, paving the way for him to apply for a British visa. Under British immigration rules, any person convicted for more than four years is not eligible for a visa. Since the actor was convicted for five year, he was denied visa by the UK Embassy. The passports of Indian convicts are stamped with the word "convict."
 The actor had approached the High Court seeking a stay on his conviction so that he could file a fresh application for a British visa.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more