పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ తో మహేష్ బాబు గొడవలు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత మళ్ళీ అగ్ర హీరోల రెగ్యులర్ షూటింగ్స్ మొదలవుతున్నాయి. కరోనా వలన ఇప్పటికే ఏడాదికి పైగా సమయం వృధా అయ్యింది. మంచి మంచి ఫెస్టివల్ సీజన్స్ బిజినెస్ లేకుండా గడిచిపోయాయి. ఆ దెబ్బ పెద్ద హీరోల సినిమాలపై గట్టిగానే పడింది. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.
ఫైనల్ గా మహేష్ బాబు కూడా తన తదుపరి సినిమాతో బిజీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పవర్ఫుల్ గా రెడీ అవుతోంది. అయితే అందులో ప్రతి పాత్ర కూడా సినిమా కథలో చాలా కీలకమని టాక్ వస్తోంది. ఇక సీనియర్ కన్నడ హీరో అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని కథనాలు వెలువడుతున్నాయి.

అయితే మహేష్ పాత్రకు, అర్జున్ క్యారెక్టర్ కు మధ్య ఉండే సన్నివేశాలు సినిమా మొత్తంలో హైలెట్ గా ఉంటాయని సమాచారం. సెకండ్ హాఫ్ లో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవకు దారి తీసే ఎపిసోడ్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని టాక్ వస్తోంది. మరి ఆ సీన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఇదే ఎడాది పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ డేట్ కుదరకపోతే వచ్చే ఏడాది సమ్మర్ లో రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











