»   » 'అత్తారింటికి దారేది' లో హైలెట్స్ ఇవే... (ఫోటో ఫీచర్)

'అత్తారింటికి దారేది' లో హైలెట్స్ ఇవే... (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ చిత్రం అంటేనే ఓ ప్రత్యేకంగా ప్రేక్షకులు,అభిమానులు చూస్తారు. అందులో త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే మరీను. పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' లో ఎన్నో ప్రత్యేకలు ఉన్నట్లు సమాచారం. ప్రేక్షకులకు ఓ విందు భోజనంలా ఈ చిత్రాన్ని ఇవ్వాలని పవన్,త్రివిక్రమ్ కలిసి డిజైన్ చేసినట్లు చెప్తున్నారు.

ఈ చిత్రంపై ఇప్పటికే ఉన్న క్రేజ్ ని మరింత పెంచటానికా అన్నట్లు.... రోజుకొకటి ఈ చిత్రం గురించి రివిల్ అవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫెరఫార్మెన్స్, బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకు ప్రాణం అని చెప్తున్నారు. సమంత డీసెంట్ రోల్ ప్లే చేస్తే...ప్రణీత ... గ్లామర్ గా కనిపించి అలరిస్తుందని చెప్తున్నారు.

సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా తన పాత్ర డబ్బింగ్‌ను పవన్‌కల్యాణ్ పూర్తి చేశారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని పూర్తి స్ధాయిలో విడుదలకు సిద్దం చేసారు. రాష్ట్రంలో ఉన్న గొడవలు సర్దుమణగగానే చిత్రాన్ని విడుదల చేస్తారు.

చిత్రంలో హైలెట్స్ ..స్లైడ్ షో లో...

బ్రహ్మానందం హైలెట్...

బ్రహ్మానందం హైలెట్...

ఇప్పుడు ఏ సినిమాలో చూసినా బ్రహ్మానదం సెకండ్ హీరో తరహాలో సీన్స్ ఉంటున్నాయి. ప్రేక్షకులు సైతం దానిని ఎంజాయ్ చేస్తున్నారు. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ పవన్ కళ్యాన్, బ్రహ్మిల మధ్య ‘అత్తారింటికి దారేది' సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ను పెట్టారు. సమాచారం ప్రకారం వీరిద్దరి నడుమ వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణట. ఇదివరకు చెప్పినట్టే పవన్ ఫుల్ జోష్ తో పాడిన ‘కాటమరాయుడా' పాట సైతం బ్రాహ్మిని ఉద్దేశించి పాడినదే.

అత్త పాత్ర సూపర్బ్...

అత్త పాత్ర సూపర్బ్...

అత్త పాత్రలో మాజీ హీరోయిన్ నదియా అదరకొట్టిందని సమాచారం. ఆమె పవన్ కళ్యాణ్ తో పోటీపడి మరీ నటించిందని అంటున్నారు. ఆమెకు,పవన్ కి మధ్య వచ్చే సీన్స్ విజిల్స్ వేయిస్తాయని,ఆమెను పవన్ టీజ్ చేస్తాడని అది ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా ఉన్నారు. అందులోనూ అత్త,అల్లుళ్ల మధ్య నడిచే కథతో వచ్చిన చిత్రాలు తెలుగులో ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ చిత్రం కథాసం మరో సారి హాట్ టాపిక్ గా మారింది.

దేవిశ్రీప్రసాద్ సైతం...

దేవిశ్రీప్రసాద్ సైతం...

ఈ చిత్రంలో మరో ప్రత్యేకత చోటు చేసుకోనుంది. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మరోసారి తెరపై తళుక్కున మెరవబోతున్నాడు. దేవి ఓ పాటలో కనిపిస్తారు. ఇదివరకు ఆయన 'శంకర్‌దాదా ఎమ్‌.బి.బి.ఎస్‌' చిత్రంలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇంతకుముందు 'జులాయి' చిత్రంకోసం అల్లు అర్జున్‌తో కలిసి ఓ ప్రచారగీతంలో ఆడిపాడారు దేవి. తమిళంలో 'మన్మదన్‌ అంబు', 'వెడి' చిత్రాల్లోనూ ప్రత్యేక పాత్రలు చేశారు. తాజాగా మరోసారి కెమెరా ముందుకొచ్చారు. 'అత్తారింటికి దారేది' చిత్రానికి స్వరాలు సమకూర్చడంతో పాటు ఇందులో 'నిన్ను చూడగానే...' అంటూ సాగే గీతాన్ని రాశారు దేవిశ్రీప్రసాద్‌. ఆ పాటలోనే ఆయన కనిపిస్తారని తెలుస్తోంది.

పాటసైతం స్పెషాలిటీనే...

పాటసైతం స్పెషాలిటీనే...

ఇక ఈ చిత్రంతో మరో ప్రత్యేకత...పవన్ పాట పాడటం అని అందరికీ తెలిసిందే. ‘కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా...' అనే ఆ పాట తాలూకు వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకుముందు పలు పాటలను పవన్‌కల్యాణ్ పాడినప్పటికీ వాటి విజువల్స్ బయటికి రాలేదు. కానీ ఈ పాటను పవన్ పాడుతున్నప్పుడు చిత్రీకరించి, ఆదివారం విడుదల చేశారు. ఇప్పటివరకు పవన్ పాడిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. యూ ట్యూబ్‌లో రెండు రోజుల్లోపే ఐదు లక్షలమందికి పైగా ఈ పాటను వీక్షించడం విశేషం. ఆ విధంగా ఇది సూపర్ డూపర్ హిట్టయ్యిందని అంచనా వేయొచ్చు.

పంచ్ డైలాగ్స్ ...

పంచ్ డైలాగ్స్ ...


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రాలలో పంచ్ డైలాగులకూ, కామెడీ సీన్లకు కొదవ ఉండదు. ఈ చిత్రంలో కూడా వాటిని మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ట్రైలర్ లో ఇప్పటికే వదిలిన డైలాగు జనాలని మెస్మరైజ్ చేస్తోంది. "చూడప్పా సిద్దప్పా... నేను సింహం లాంటివాడిని... దానికి నాకు తేడా ఒక్కటే... అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఆయన అభిమానులు ఉర్రూతలూగిస్తోంది. ఈ ఒక్క డైలాగు జనాలను థియోటర్స్ దగ్గరకు లాక్కువస్తుందని చెప్తున్నారు.

ప్యామిలీ ఎంటర్టైనర్..

ప్యామిలీ ఎంటర్టైనర్..

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే ‘జల్సా' చిత్రం రూపొంది మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో ‘అత్తారింటికి దారేది' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. అప్పట్లో త్రివిక్రమ్ రచన తో రూపొందిన నువ్వు నాకు నచ్చావు లా అలరిస్తుందని భావిస్తున్నారు.

బొమన్ ఇరాని..

బొమన్ ఇరాని..

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బొ మన్ ఇరాని కనిపించి అలరించనున్నారు. ఆయన పవన్ కి తాతగాకనిపిస్తారని తెలుస్తోంది. ఆయన పాత్ర సినిమాని లీడ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. స్పెయిన్ లో ఉన్న పవన్ ఇండియా రావటానికి ఈ పాత్ర ప్రేరణ ఇస్తుందని, పవన్ కీ, బొమన్ ఇరానీకి మద్య వచ్చే సన్నివేశాలు సినిమాకు కీలకమని చెప్తున్నారు. అందులోనూ బొమన్ ఇరాని ఇప్పటికే ఓ రేంజిలో ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టు. ఆయన ఈ చిత్రానికి ప్లస్ అవుతారనటంతో సందేహం లేదు.

పవన్ గ్లామర్ ...

పవన్ గ్లామర్ ...

ఖుషీ,గబ్బర్ సింగ్ ని దాటే చిత్రం అవుతుందని అభిమానులంతా ఈ చిత్రంపై నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం లో పవన్ మరింత గ్లామర్ గా కనిపించటంతో వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ పంచ్ లని పవన్ చెప్పే స్టైల్ సైతం సినిమాని ఓ రేంజికి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నారు.

సమంతతో తొలి కాంబినేషన్

సమంతతో తొలి కాంబినేషన్

హిట్ లో ఉన్న హీరోయిన్ సమంత ఈ చిత్రంలో పవన్ సరసన చేస్తోంది. అది ఈ సినిమాలో ప్రత్యేకతే అని చెప్పాలి. ఆమె లుక్స్..స్టైల్ ఈ సినిమాకు ప్రధానాకర్షణ అవ్వనుంది. ఆమెకు మహిళల్లో ఉన్న ఫాలోయింగ్ సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది. అందులోనూ త్రివిక్రమ్ ఆమెకు ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేసి, దానికి తగ్గ గ్లామర్ టచ్ తో చూపించారు.

ఓ రేంజి క్రేజ్

ఓ రేంజి క్రేజ్

‘ఎవడు' కంటే ముందు విడుదల కావలసిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల వాయిదాపడుతుండటంతో పవర్ స్టార్ పవన్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అదీగాక ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో పూర్తీగా హాస్యరస ప్రధానంగా నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. పవన్ - బ్రహ్మానందంల హాస్యం - మహేష్ బాబు అతిధి పాత్ర - పవన్ కల్యాణ్ పాట....అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ పడిన పాటను యుట్యూబ్లో పెడితే కేవలం 24 గంటల్లో 3,70,000 మంది వీక్షించారంటే అభిమానులు ఏ రేంజ్లో ఎదురు చూస్తున్నారో ఊహించుకోవచ్చు. పవన్ అభిమానులతోపాటు ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా తమ హీరో ఎటువంటి పాత్ర పోషించాడో చూసేందుకు ఎదురు చూస్తున్నారు.

పాటలు ఇప్పటికే హిట్...

పాటలు ఇప్పటికే హిట్...

ఆడియో రిలీజ్ అయిన రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చి రికార్డులు సృష్టించింది. ఎక్కడ విన్నా 'అత్తారింటికి దారేది' పాటలే వినిపిస్తున్నాయి. ఈ క్రెడిట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కూ, గేయ రచయితలకూ దక్కుతుంది. అలాగే ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ అనూహ్యం. సినిమా సైతం అదే ఆదరణ పొందుతుందనే నమ్మకం అందరిలో ఉంది . ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా, పవన్‌ అత్తగా నదియా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అత్తారింటికి దారి వెతుకులాటలో ఏ తేది ప్రకటిస్తారో వేచి చూడవలసిందే. అభిమానులకు ఇదో పెద్ద ఆశాభంగం!

అలీ కూడా...

అలీ కూడా...

అలీ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ చిత్రంలో అలీ కూడా ఓ మంచి పాత్రలో కనపిస్తారు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Pawan Kalyan’s easeful performance and Brahmanandam’s comedy are said to be major highlights of ‘Atharintiki Daaredi’ movie. While Samantha played decent role, Praneetha will be seen glamorous especially in songs. Scenes between Pawan and Brahmi are going to be laugh riot. Brahmi usually plays second major role after heroes in most of the Trivikram’s films and in Atharintiki Daaredi he got a far better role. Even Nadhiya got good role to showcase her acting skills. She dominated even the leading ladies. Boman Irani’s entry into Tollywood is other attraction and he is to enthrall for some time as Pawan’s grandfather.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu