»   »  సల్మాన్‌ ఖాన్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

సల్మాన్‌ ఖాన్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ రోజు (సోమవారం) కొట్టివేసింది. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారించిన ముంబయిలోని సెషన్స్‌ కోర్టు గతంలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ముంబయి హైకోర్టు సల్మాన్‌కు అదే రోజు బెయిలు మంజూరు చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ బెయిలుని రద్దు చేయాలని, సల్మాన్‌కు జీవితఖైదు విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ని ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2002లో ముంబయిలో సల్మాన్‌ ఖాన్‌ కారు ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే.

 Salman Khan

హిట్ అండ్ రనే కేసులో సల్మాన్ ఖాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు గతంలో దోషిగా తేల్చింది. కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవ్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది.

ఆ సమయంలో సల్మాన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్థర్ రోడ్ జైలుకు ఆయన్ని తరలించే అవకాశం ఉంది. కోర్టు అతనికి ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తుందనేది చర్చనీయాంశం అయింది.

English summary
The Supreme Court on Monday dismissed a petition seeking cancellation of bail of film star Salman Khan who was convicted and sentenced in a hit and run case. The apex court bench headed by Chief Justice H.L. Dattu declined the plea by one of the alleged victims associated with the case and belonging to Mumbai Police.
Please Wait while comments are loading...