»   » మహానటికోసం భారత దేశం వచ్చిన హాలీవుడ్ కెమెరామెన్

మహానటికోసం భారత దేశం వచ్చిన హాలీవుడ్ కెమెరామెన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లెజండరీ నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ తెరకెక్కిస్తున్న బయోపిక్ "మహానటి". ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ "స్వప్న సినిమా" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. కంటెంట్ పరంగానే కాక క్వాలిటీ పరంగానూ అద్భుతమైన ఔట్ పుట్ తీసుకురావడం కోసం చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. అందుకోసమే హాలీవుడ్ కెమెరామెన్ డానీ సంచేజ్-లోపెజ్ ను యూనిట్ లో భాగస్వాములను చేశారు.


Hollywood cameraman Dani Sanchez-Lopez for Mahanati

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ.. "పలు ఇంటర్నేషనల్ యాడ్స్-మ్యూజిక్ వీడియోస్ మరియు డాక్యుమెంటరీస్ ను చిత్రీకరించిన ప్రముఖ హాలీవుడ్ కెమెరా టెక్నీషియన్లు డానీ సంచేజ్-లోపెజ్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్ "మహానటి" చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా రియలిస్టిక్ గా కనిపించడానికి ఈయన పనితనం బాగా ఉపయోగపడుతుంది. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది" అన్నారు.

English summary
Director Nag Ashwin and producers Swapna Dutt, Ashwini Dutt have roped vastly experienced Hollywood cameraman Dani Sanchez-Lopez for "MahanaTi" Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu