»   » అనసూయ ఇరగదీసింది.... హాలీవుడ్ హీరోయిన్ లుక్ లో

అనసూయ ఇరగదీసింది.... హాలీవుడ్ హీరోయిన్ లుక్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాంకర్ అనసూయ.. ఈ రోజున తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కర్లేనిపేరు. బుల్లితెర ప్రపంచంలో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్ సినిమాల్లో కూడా తన సత్తా ఏమిటో చూపించి, దూసుకుపోతోంది. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఈ భామ.

Hot Anchor Anasuya new photo shoot with Horses

తన సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటోంది అనసూయ. అంతెందుకు ఈ మధ్యన స్టేజీపై ఆమె హీరోయిన్స్ పోటీ ఇచ్చింది. దాంతో అనసూయ వస్తోందంటే హీరోయిన్స్ కి భయం పట్టుకుందనే టాక్ ఒకటి బయిలుదేరింది. సోగ్గాడే చిన్ని నాయినా తో వెండి తెరమీదా తన విన్యాసాలు చూపిన ఆమె క్షణం హిట్ అయ్యిన తర్వాత ఆమె క్షణం బిజీలేని స్టార్ గా మారింది. ఇప్పుుడామె దృష్టి అంతా సెకండ్ హీరోయిన్ రోల్స్ పై ఉందంటున్నారు. అందుకోసం ఆమె ఈ ఫొటో షూట్ లో పాల్గొనొంది అని చెప్తున్నారు కొందరు.

అందగత్తె కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఎక్కువే. ఇక తరచూ ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో అనసూయ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో పలు సంస్థలు ఆమెతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా తేజ సారీస్ కోసం ఆమె ప్రత్యేకంగా ఫోటో షూట్లో పాల్గొంది. బ్రైట్ ఎల్లో టాప్, లైట్ గ్రీన్ స్కర్టు ధరించిన అనసూయ తన సూపర్ హాట్ లుక్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోకు ఇపుడు మంచి స్పందన వస్తోంది. దీన్ని బట్టి అనసూయ మోడలింగ్ రంగంలో కూడా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.మెను తమ సినిమాలోకి తీసుకోవడానికి ఆసక్తిని చూపుతోన్న దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగానే వుంది.

Hot Anchor Anasuya new photo shoot with Horses

ఈ నేపథ్యంలోనే అనసూయ సోషల్ మీడియాలో తన ఫోటో ఒకటి షేర్ చేసింది. ఇది తన లేటెస్ట్ సినిమాకి సంబంధించినదనీ .. ఇలాంటి ఫోటోలు వరుసగా వస్తూనే వుంటాయని చెప్పింది. ఈ ఫోటోలో డిఫరెంట్ లుక్ తో అనసూయ మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో ఏ సినిమాకి సంబంధించినదా అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ విషయాన్ని త్వరలోనే అనసూయనే చెప్పేస్తుందేమో చూద్దాం

English summary
Anasuya posted a New Hot Sizzling Photo on he face book wall with horses, says "Nothing can be so wonderful to me than watching horses roaming and running wild and free.."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu