»   » ‘చిత్రాంగద’లో హీరోయిన్ అంజలి హాట్ లుక్ (ఫోటోస్)

‘చిత్రాంగద’లో హీరోయిన్ అంజలి హాట్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'చిత్రాంగద'. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా పతాకంపై పిల్ల జమీందార్‌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రముఖ దర్శకుడు అశోక్‌.జి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Hot Photos: Actress Anjali in Chitrangada

ఒక పాట మినహా షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అశోక్‌. జి తెలియజేస్తూ...'' గీతాంజలి తర్వాత అంజలికి పలు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల ఆఫర్లు వచ్చినా..ఆమె అంగీకరించలేదు. మా కథ విన్న వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఓ విభిన్నమైన కాన్సెఫ్ట్‌తో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న థ్రిల్లర్‌ హారర్‌ కామెడీ చిత్రమిది. కథ డిమాండ్‌ మేరకు అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లోని పలు అందమైన లోకేషన్లలో 80 శాతం షూటింగ్‌ జరిపాము. పలువురు హాలీవుడ్‌ టెక్నిషీయన్స్‌ కూడా ఈ చిత్రానికి పనిచేశారు. తప్పకుండా ఈ చిత్రం అంజలి కెరియర్‌లో కలకాలం గుర్తుండేలా ఉంటుంది..'' అన్నారు.

Hot Photos: Actress Anjali in Chitrangada

నిర్మాత గంగపట్నం శ్రీధర్‌ మాట్లాడుతూ..''గీతాంజలి తర్వాత అంజలికి పలు ఆఫర్లు వచ్చినా..దర్శకుడు అశోక్‌ చెప్పిన కథతో పాటు ఆయన ప్రతిభ మీద నమ్మకంతో అంజలి ఈ సినిమా అంగీకరించింది. ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. అమెరికాతో పాటు, బెంగళూర్‌, వైజాగ్‌, హైదరాబాద్‌లలోని పలు లోకేషన్‌లలో చిత్రీకరణ జరిపాము. బ్యాలెన్స్‌గా ఉన్న పాటను త్వరలోనే చిత్రీకరించనున్నాము. తప్పకుండా ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది..'' అన్నారు.
అంజలి, సింధుతులానీ, సప్తగిరి, రక్ష, రాజారవీంద్ర, జ్యోతి, సాక్షిగులాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్‌; ఎడిటర్‌: ప్రవీణ్‌పూడి; కెమెరా: బాల్‌రెడ్డి; నిర్మాత: గంగపట్నం శ్రీధర్‌ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్‌.జి.

English summary
Telugu Actress Anjali in Chitrangada Movie Images.
Please Wait while comments are loading...