For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అనుష్క హాట్ హాట్ గా (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: అనుష్క ఉందంటే యూత్, ఫ్యామిలీ రెండు వర్గాలు వారు సినిమాకు వస్తారు. అందం, అభినయం రెండూ కలగలసిన ఆమె సినిమాలు అంటే ట్రేడ్ లోనూ మంచి క్రేజే. తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్న ఈ కన్నడ భామ.. గ్లామర్ కి కొత్త అర్దం చెప్తోంది. వయస్సు పెరుగుతున్న కొద్ది ఆమెలో అందం మరింతగా అందరినీ అకర్షిస్తోంది. అనుష్క తాజా చిత్రం ఢమురకం మరో రెండు రోజుల్లో విడుదల అవుతున్న సందర్భంగా.. అనుష్కని గుర్తు చేసుకుంటూ...

  'సూపర్' తో అనుష్క పరిచయమైనా 2006లో వచ్చిన రవితేజ, రాజమౌళి 'విక్రమార్కుడు' చిత్రం ద్వారానే ఆమెలో నటి పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రంలో నీరజ గోస్వామి పాత్ర అందరి మనస్సులో నిలిచిపోయింది. అది మొదలు ఆమెకు తిరుగేలేకుండాపోయింది.

  స్వీటీ అనే ముద్దు పేరున్న అనుష్క... 2007లో వచ్చిన లక్ష్యం చిత్రంలో.. ఇందు అనే సెక్సీ కాలెజీ గర్ల్ గా అదరగొట్టింది. ఆమెలో గ్లామర్ ఏంగిల్ ఈ చిత్రంతోనే పూర్తిగా వెలికి వచ్చింది. గోపీచంద్ తో చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అందరూ హీరోలు ఆమె తమతో చేయాలని కోరుకునేలా చేసింది.

  నాగార్జునతో చేసిన 'సూపర్' చిత్రం యావరేజ్ అయ్యింది. అయినా నాగ్ తో ఆమె కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది. తర్వాత నాగ్ తో చేసిన 'డాన్' సినిమా పెద్ద ప్లాప్ అయింది. తర్వాత 'రగడ' చిత్రం హిట్టైంది. దాంతో ఢమురకం తో మళ్లీ ఈ కాంబినేషన్ తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోంది.

  లక్ష్యం సక్సెస్ తో అనుష్క,గోపీచంద్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ రావటంతో ఈ కాంబినేషన్ లో మరోసారి శౌర్యం చిత్ర తెరకెక్కింది. ఆ చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది.

  ఎన్ని సినిమాలు చేసినా అరుంధతితోనే అనుష్క హైట్స్ కి వెళ్లింది. అక్కడ నుంచి ఆమె కెరీర్ మలుపు తిరిగింది. జేజమ్మగా అందరి మన్ననలూ పొందింది. అనుష్క ప్రస్దావన వస్తే అరుంధతిని గుర్తు చేసుకోకుండా ఉండలేం. ఈ సినిమాతో ఆమె విమర్శల ప్రశంసలు సైతం పొందింది.

  అరుంధతి తర్వాత ఆమె చేసిన ప్రభాస్ తో ఆమె చేసిన భిళ్లా చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో ఆమె బికినీతో కనిపించి అందరినీ అలరించింది. తమిళంలో నయనతార పాత్రను ఇక్కడ సమర్ధవంతగా పోషించి తమిళ పరిశ్రమను తనవైపుకు తిప్పుకుంది.

  అరుంధతి చిత్రం తర్వాత ఆమె చేసిన వేదం చిత్రం మరోసారి ఆమెలో నటిని బయిటకు తీసి శభాష్ అనిపించుకునేలా చేసింది. అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ఆమె సరోజ పాత్రలో చేసి ఫిల్మ్ ఫేర్ అవార్డు సైతం పొందింది.

  వేదం తర్వాత అనుష్క వరసగా 2010లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంది. అయితే సంవత్సరం చివర్లో నాగార్జునతో చేసిన రగడ చిత్రం మళ్లీ హిట్ ఇచ్చి నిలబెట్టింది.

  నాగార్జునతో నాలుగో సారి అనుష్క ఢమురకం చిత్రం చేస్తోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నాగార్జున చెప్తున్నారు.

  భిళ్లా తర్వాత ప్రభాస్ తో మరోసారి మిర్చి చిత్రం చేస్తోంది. రెబెల్ తోనే ఈ కాంబినేషన్ మరోసారి కనువిందు చేయాల్సింది కానీ లారెన్స్ తో వచ్చిన విభేదాలు వల్ల ఆమె తప్పుకుంది.

  అనుష్క తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కమిటైంది. చిత్రం టైటిల్ రుద్రమదేవి. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ చేసారు. అరుంధతిని పోలిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రశంసలుతో పాటు విమర్శలను సైతం అందుకుంటోంది.

  English summary
  Actress Anushka Shetty, who debuted in films with Telugu film Super in 2005, might have joined late, but she has struck gold in very short span of time. Fondly called Sweety Shetty, she has acted mainly in the Telugu and Tamil film industries and become one of South India's most leading actresses in just seven years. She is also one among the highest paid actresses in South India.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more