»   » ప్రభాస్ బ్రాండ్ వ్యాల్యూ 10 కోట్లా..!? రేటు తో షాకిచ్చాడు

ప్రభాస్ బ్రాండ్ వ్యాల్యూ 10 కోట్లా..!? రేటు తో షాకిచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'బాహుబలి' సినిమాతో దేశవ్వాప్తంగా పాపులర్‌ అయిపోయాడు. 'బాహుబలి'తో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్. భారీ అంచనాల మధ్య బాహుబలి 2 ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా గల క్రేజీని వినియోగించుకోవాలని వివిధ సంస్ఠలు పోటీపడుతున్నాయి.

నయా సూపర్‌స్టార్‌

నయా సూపర్‌స్టార్‌

తెలుగు, తమిళం, హిందీ బాషల్లో నయా సూపర్‌స్టార్‌గా అవతరించాడు. దీంతో మన ప్రభాస్‌ను అంబాసిడర్‌గా నియమించుకోవడానికి పలు బ్రాండ్లు ఆసక్తిగా ఉన్నాయట. ఇప్పటికే ఎంతో మంది ప్రభాస్‌ను ఈ విషయమై సంప్రదించారట.అయితే ప్రభాస్‌ అడుగుతున్న రెమ్యునరేషన్‌ వారిని టెన్సన్‌ పెడుతోందట.

తన బ్రాండ్ విలువ

తన బ్రాండ్ విలువ

సినిమా చుట్టూ తయారైన క్రేజీని, హైప్‌ని దృష్టిలో పెట్టుకుని సొమ్ము చేసుకోవాలని బ్రాండ్ కంపెనీలు పరుగులు పెడుతూ ప్రభాస్ ముందు వాలిపోతున్నాయి. కానీ బాహుబలి 2 విడుదల తర్వాత తన పాపులారిటీ ఏ రేంజిలో పెరగనుందో బాగా గ్రహించిన ప్రభాస్ దానికి అనుగుణంగానే తన బ్రాండ్ విలువను పెంచాలని డిసైడ్ అయిపోయాడు.

అందరికీ షాక్ కలిగిస్తోంది

అందరికీ షాక్ కలిగిస్తోంది

బాహుబలి పుణ్యమా అని తనకు ఏర్పడిన బ్రాండ్ విలువను పూర్తిస్థాయిలో వాడుకోవాలని ప్రభాస్ భావించడమే అందరికీ షాక్ కలిగిస్తోంది. ఏ కంపెనీ అయినా తనను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవాలంటే ప్రభాస్ పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని వార్త. ఇది ప్రస్తుతం స్టార్‌లకున్న మార్కెట్ రేంజ్‌కి డబుల్ రేట్ అట.

ఎంత పెద్ద కంపెనీకైనాసరే

ఎంత పెద్ద కంపెనీకైనాసరే

దేశంలో పేరొందిన క్రికెట్ స్టార్లు, బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ఎంత పెద్ద కంపెనీకైనాసరే బ్రాండ్ అంబాసిడర్లు కావాలంటే నాలుగు లేదా అయిదు కోట్ల రూపాయలను డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. అయితే ఎంత బాలీవుడ్‌ స్టార్‌ అయినా వారికి దక్షిణాదిన అంత ఫాలోయింగ్‌ ఉండదు.

బాహుబలి 2 కూడా

బాహుబలి 2 కూడా

అదే ప్రభాస్‌ అయితే బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌.. ఇలా అన్ని ఇండస్ట్రీలకు సుపరిచితుడు. పైగా త్వరలోనే ‘బాహుబలి-2' కూడా విడుదలవుతోంది. ఇది కూడా సూపర్‌హిట్‌ అయితే ప్రభాస్‌ ఇమేజ్‌ మరింత పెరుగుతుంది. అందుకే ప్రభాస్‌ అంత డిమాండ్‌ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే ప్రభాస్‌తో ఒప్పందం కుదుర్చుకోగా.. మరికొంత మంది సినిమా విడుదలైన తర్వాతడీల్‌ సెట్‌ చేసుకుందామని అనుకుంటున్నారట.

English summary
Various brands are approaching Prabhas to promote their products. From car to glairs, to shoe to colognes to fitness brands, all these sectors have approached Prabhas to come on board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu