»   » వరుస ఫ్లాపులు కానీ రేటు మాత్రం వంద కోట్లు: మన హీరో కళ్ళు తిరిగే బ్రాండ్ వాల్యూ

వరుస ఫ్లాపులు కానీ రేటు మాత్రం వంద కోట్లు: మన హీరో కళ్ళు తిరిగే బ్రాండ్ వాల్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హృతిక్‌ రోషన్‌కి ఈమధ్య కాలంలో చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 'క్రిష్‌' సిరీస్‌ చిత్రాలతో సూపర్‌హీరోగా మారిన హృతిక్‌రోషన్‌ సినిమా వస్తుందంటే అభిమానులు చాలా అంచనాలు పెట్టుకుంటారు. స్టార్ హీరోగా కొనసాగుతున్న హృతిక్‌ కాబిల్ లో అంధుడిగా నటించడం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. గతేడాది హృతిక్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించిన 'మొహెంజొదారో' చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది.ఈ సారైనా పెద్ద హిట్ ఇస్తాడు అనుకుంటే "బలం" లో అసలు బలమే లేకపోవటం తో చతికిల బడ్డాడు హృతిక్. నిజానికి గతకొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు హృతిక్. గతసంవత్సరం వచ్చిన మొహంజో దారో, కాబిల్ లాంటి భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు కూడా దారుణం గా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఉన్న పోటీని తట్టు కోవటానికి హృతిక్ కి ఖచ్చితంగా ఒక హిట్ అవసరం.

వంద కోట్లకి డీల్‌

వంద కోట్లకి డీల్‌

ఒకదాని వెనుక ఒకటి వరుసపెట్టి పరాజయాలు వేధిస్తోన్న ఈ తరుణంలో హిట్‌ ఎలా ఇవ్వాలా అని అతను తల పట్టుకున్నాడు. అయితే ఎన్ని ఫ్లాప్స్‌ వచ్చినా కానీ హృతిక్‌ రేంజ్‌ ఏమీ మారలేదని, అతని బ్రాండ్‌ వేల్యూ అలాగే వుందని నిరూపిస్తూ ఒక ఫిట్‌నెస్‌ కంపెనీ అతనితో వంద కోట్లకి డీల్‌ కుదుర్చుకుంది.

Jr. NTR at No.1, Hritik Roshan in 2nd Place | Filmibeat Telugu
క్రిష్-4

క్రిష్-4

ఈ మధ్యన ఈయన తండ్రి రాకేష్ రోషన్ మాత్రం క్రిష్-4 మీద వర్కు నడుస్తోందని చెప్పాడు. మొత్తానికి అటు సినిమాలు లేక పోవటం తో ఉన్నసమయాన్ని ఇలా బట్టలిప్పేసి తన టామీ హిల్‌ఫిగర్ బ్రాండ్ బట్టల కోసం ఫోజులు ఇస్తున్నాడు. పనిలో పనిగా ఇంకో డీల్ కూడా కుదుర్చుకున్నాడు.

క్యూర్‌-ఫిట్‌ కి అంబాసిడర్‌గా

క్యూర్‌-ఫిట్‌ కి అంబాసిడర్‌గా

హృతిక్‌ అయిదేళ్ల పాటు క్యూర్‌-ఫిట్‌ అనే సంస్థకి అంబాసిడర్‌గా ఉండటానికి గానూ భారీ ఆఫర్ అందుకున్నాడు. ఈ అయిదు సంవత్సరాలకు గానూ అతనికి వంద కోట్లు చెల్లిస్తారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు జరిగిపోయాయి. హృతిక్‌కి చెందిన హెచ్‌ఆర్‌ఎక్స్‌ సంస్థతో కలిసి అసోసియేట్‌ అయి క్యూర్‌.ఫిట్‌. ఒక ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ని ఇండియాలో లాంఛ్‌ చేస్తోంది. హృతిక్‌ కంపెనీ ఇంట్రడ్యూస్‌ చేసిన వర్కవుట్‌ ప్లాన్‌ని క్యూర్‌-ఫిట్‌. విస్తృతం చేయనుంది.

బాలీవుడ్‌లో తనే టాప్‌

బాలీవుడ్‌లో తనే టాప్‌

ఖాన్‌ల తర్వాత బాలీవుడ్‌లో తనే టాప్‌ అని హృతిక్‌ ఈ డీల్‌తో ఇంకోసారి చాటుకున్నాడు. దాదాపు ఇప్పుడు బాలీవుడ్ హీరోలంతా బాడీ షోకి అలవాటు పడి పోయారు. షారుక్‌ ఖాన్‌ మాదిరిగా ఈమధ్య రఫ్‌ ఫేజ్‌ నడుస్తోన్న హృతిక్‌ అది బ్రేక్‌ చేసి మళ్లీ హిట్ల బాట పడితే ఇక అతని బ్రాండ్‌ వేల్యూ ఏ స్థాయిలో పెరుగుతుందనేది ఊహించుకోడానికే షాకింగ్‌గా వుంది.

English summary
Hrithik Roshan’s deal with Cure.Fit is the latest among startups that has signed prominent Bollywood celebrities for brand recall and positioning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu