Don't Miss!
- News
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా రూ.35 పెంపు..!!
- Sports
Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
బహిరంగ క్షమాపణలు చెప్పాడు, ఉద్దేశపూర్వకంగా అనలేదన్నాడు
ముంబయి : పోప్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ విచారం వ్యక్తంచేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావని, ఈ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడివుంటే క్షమాపణలు చెబుతున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Seems my tweet about His Holiness has led 2misunderstanding. My apologies 4 hurt caused 2religious or other sentiments. Was unintentional.
— Hrithik Roshan (@iHrithik) April 2, 2016
కంగనారౌనత్‌కు అవార్డుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. భార్యతో విడాకులు, అనంతరం మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోర్టు నోటీసులతో సతమతమవుతున్న హృతిక్.. తాజాగా మరోసారి నోటీసులు అందుకున్నాడు.
ఈసారి హృతిక్ ట్వీట్ క్రైస్తవుల మనోభావాలను గాయపరిచిందని ఆరోపణలు వినిపిస్తు్నాయి. 'మీడియా పేర్కొంటున్న అందమైన మహిళలకన్నా నాకు పోప్‌తో ఎఫైర్ కలిగివుండే అవకాశాలే ఎక్కువ' అని హృతిక్ రోషన్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్య వివాదానికి దారితీసింది.
క్రైస్తవుల మతగురువైన పోప్‌ను, క్రైస్తవ మతాన్ని అగౌరవ పరిచినందుకు ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అధ్యక్షుడు అబ్రహం మథాయ్ హృతిక్‌కు నోటీసులు పంపారు.

హృతిక్ పోప్‌కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీస్‌లో పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామిగా ఎవరినైనా ఎంచుకునే హక్కు హృతిక్‌కు ఉంది కానీ, ఇలా పోప్ పేరును వాడుకుని మతాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడితే సహించబోమని అబ్రహం వెల్లడించారు.
సెక్షన్ 295ఏ కింద హృతిక్‌కు క్రిమినల్ నోటీసులు పంపినట్లు అబ్రహం తరపు వకీలు రిజ్వాన్ సిద్దిఖి తెలిపారు. హృతిక్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి హృతిక్ రోషన్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.