»   » శాటిలైట్ హక్కులమీద 550 కోట్లా..!? హృతిక్ రోషన్ షాకింగ్ డీల్..!?

శాటిలైట్ హక్కులమీద 550 కోట్లా..!? హృతిక్ రోషన్ షాకింగ్ డీల్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో మొహెంజోదారో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న హృతిక్ రోషన్, మరో రికార్డ్ నెలకొల్పాడు. గతంలో మరే హీరో చేయని విధంగా స్టార్ నెట్ వర్క్ తో భారీ డీల్ కు అంగీకరించాడు. రాబోయే హృతిక్ సినిమాల కోసం స్టార్ టివి ఏకంగా 550 కోట్ల మొత్తానికి హృతిక్ రోషన్ తో ఒప్పదం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం హృతిక్ తన రాబోయే ఆరు సినిమాల శాటిలైట్ హక్కులను ఆ టివి చానల్ కే ఇవ్వాల్సి ఉంటుంది.ఇప్పటికే ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. కాగా బాలీవుడ్ చరిత్రలోనే ఇదే బిగెస్ట్ డీల్ అంటున్నారు విశ్లేషకులు.

Hrithik Roshan inks deal worth Rs. 550 crores for satellite rights to his films in 2017

హృతిక్‌ గత ఐదు సంవత్సరాల్లో నటించిన 'జిందగీ నా మిలేగీ దొబారా', 'అగ్నిపథ్‌', 'క్రిష్‌-3', 'బ్యాంగ్‌ బ్యాంగ్‌' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్లుగా నిలిచాయి. హృతిక్‌ డీల్‌ కుదుర్చుకోవడానికి కారణం తన సినిమాలు వరుస హిట్లు అందుకోవడమే. అదీ కాకుండా 2017లో హృతిక్‌ సొంత నిర్మాణంలో తెరకెక్కుతున్న 'కాబిల్‌' చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్‌ మీదకి వెళ్లక ముందే శాటిలైట్‌ రైట్స్‌ కింద సినిమాకి రూ.45 కోట్లు వచ్చాయి. ఈ రిపోర్ట్ ని బట్టే స్టార్ టివి ఇంత భారీ మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది

ఇలాంటి ఒప్పందం ఇదివరకు సల్మాన్‌ ఖాన్‌ ఓ టెలివిజన్‌ నెట్ వర్క్ తో కుదుర్చుకున్నాడు. జనవరి 2013 నుంచి డిసెంబర్‌ 2017 వరకు విడుదలయ్యే తన ప్రతి సినిమా ప్రీమియర్లు, ప్రసారానికి రైట్స్‌ ఇస్తూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. తాజాగా యువనటుడు వరుణ్‌ ధావన్‌ కూడా 'జుడ్వా-2' చిత్రం తప్ప నటించే ప్రతి ఒక్క సినిమా ప్రీమియర్లకు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌తో రూ.300 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం.

English summary
Hrithik Roshan has set a new record in Bollywood by inking a deal worth Rs. 550 crore – the highest amount paid for exclusive satellite rights ever, for his movies set to release in 2017, including his most awaited flick Kaabil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu