For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాజీ భార్య పుట్టినరోజు వేడుకల్లో స్టార్ హీరో: మళ్ళీ ఆనాటి లాగే...

  |

  నాలుగేళ్ల పాటు ప్రేమించుకొని, పదమూడేళ్లపాటు వైవాహిక జీవితాన్ని గడిపి, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక హృతిక్‌ రోషన్‌, సుజానే ఖాన్‌ విడిపోవడం చాలామందికి మింగుడు పడలేదు. అసలు విదిపోయే వరకూ ఇద్దరూ బయటి ప్రపంచానికి ప్రేమికుల్లాగే కనిపించారు. ఇద్దరివీ సినీ కుటుంబాలు కావడం వల్ల చిన్నతనం నుంచే ఆ ఇద్దరూ ఒకరికి ఒకరు తెలుసు. 2000 సంవత్సరంలో పెళ్లాడటానికి ముందు నాలుగేళ్ల పాటు ఆ ఇద్దరూ ప్రేమపక్షులై విహరించారు. పెళ్లయిన ఆరేళ్లకు రెహాన్‌, ఎనిమిదేళ్లకు హృదాన్‌ పుట్టారు. ఆ తర్వాత కూడా బహిరంగంగా తమ మధ్య ప్రేమను దాచుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించని ఆ ఇద్దరూ అందరికీ దిగ్ర్భాంతిని కలిగిస్తూ 2013 డిసెంబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

  పెళ్లి బంధాన్ని నేనెంతో గౌరవిస్తాను

  పెళ్లి బంధాన్ని నేనెంతో గౌరవిస్తాను

  "నా అభిమానులకూ, పెళ్లి అనే బంధానికీ అత్యంత విలువనిచ్చేవాళ్లకూ ఈ వార్త కలవరాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. పెళ్లి బంధాన్ని నేనెంతో గౌరవిస్తాను. అయితే నా నుంచి విడిపోవాలనీ, మా పదిహేడేళ్ల అనుబంధాన్ని ముగించాలనీ సుజానే నిర్ణయించుకుంది.

  Hrithik Roshan Responded About The Relationship With Kangana Ranaut
   ఇది ప్రేమకు నేను పలికే గొప్ప నీరాజనం

  ఇది ప్రేమకు నేను పలికే గొప్ప నీరాజనం

  నా తదుపరి జీవితంలోనూ సుజానే అందించిన ప్రేమ నాతోనే ఉంటుంది. నేను లేకుండా ఆమె ముఖంలో నవ్వులు మరింతగా విరబూస్తాయంటే, ఎలాంటి నిబంధనలూ లేకుండా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇది ప్రేమకు నేను పలికే గొప్ప నీరాజనం'' అని అప్పట్లో తెలిపాడు హృతిక్‌.

  పిల్లల కోసం

  పిల్లల కోసం

  ఈ ప్రేమ జంట విడిపోతున్నారని వార్తలొచ్చినప్పుడు హృతిక్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి లోనయ్యారు. కానీ ఈ జంట మాత్రం అన్ని జంటల్లా ఎడమొహం పెడమొహం పెట్టకుండా విడాకులు తీసుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు పిల్లల కోసం కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతీసారి చాలా సరదాగా గడుపుతున్నారు.

   కంగనా రనౌత్‌తో ఎఫైర్

  కంగనా రనౌత్‌తో ఎఫైర్

  మొన్నటికిమొన్న కంగనా రనౌత్‌తో ఎఫైర్ వివాదంలోనూ సుజానే తన మాజీ భర్త హృతిక్‌కి చేదోడువాదోడుగా నిలిచింది. అలా మళ్ళీ కలిసి కనిపిస్తూంటే మళ్ళీ కలిసి పోతారేమో అనుకున్నా అలాంతి అవకాశం లేదని చీపేసారు. ఇక ఆ తర్వాత కంగనా తో ప్రేమాయణం వివాదం లో చిక్కుకున్న హృతిక్ కి సపోర్ట్ గానే నిలిచింది సుజానే...

   సుజానే ఖాన్ పుట్టిన రోజు

  సుజానే ఖాన్ పుట్టిన రోజు

  మొన్నీమధ్య సుజానే ఖాన్ త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను స్నేహితులు, కుటుంబ స‌భ్యులతో ఘ‌నంగా జ‌రుపుకుంది. ఈ వేడుక‌ల‌కు హృతిక్ రోష‌న్ కూడా హాజ‌ర‌య్యాడు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోల‌ను సుజానే ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో హృతిక్ తో మళ్ళీ పాతపద్దతిలోనే ఉంది. మరి ఈ విడిపోవటం ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు...

  నా జీవితాన్ని ప్ర‌త్యేకంగా మార్చిన వారందరికీ కృత‌జ్ఞ‌త‌లు

  నా జీవితాన్ని ప్ర‌త్యేకంగా మార్చిన వారందరికీ కృత‌జ్ఞ‌త‌లు

  "న‌న్ను, నా జీవితాన్ని ప్ర‌త్యేకంగా మార్చిన వారందరికీ కృత‌జ్ఞ‌త‌లు" అంటూ ఆమె ఫొటో పోస్ట్ చేసింది. ఈ వేడుక‌కు సుజానే సొద‌రుడు జాయెద్ ఖాన్‌, అత‌ని భార్య మ‌లైకాల‌తో పాటు సుజానే స్నేహితులు ట్వింకిల్ ఖ‌న్నా, క‌ర‌ణ్ జొహార్‌లు కూడా హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది.

  English summary
  Sussanne, along with ex-husband Hrithik Roshan, and friends Twinkle Khanna, Sonali Bendre and Gayatri Oberoi among others, celebrated her 39th birthday last night at the Koko Asian Gastropub in Parel in the company of her friends. Here’s who turned up.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X