»   » తెలుగు తెరపై.... హృతిక్ రోషన్ ‘బలం’ (ఫస్ట్ లుక్)

తెలుగు తెరపై.... హృతిక్ రోషన్ ‘బలం’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రానికి తెలుగు టైటిల్ "బలం" అని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా లో విడుదల చేసింది.

గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ బలం తో తెలుగు ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ చిత్రం లో హృతిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాకేష్ రోషన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి.

"ఒక విన్నూత్న ఆక్షన్ డ్రామా కి అంతర్లీనంగా ఉండే ఒక చక్కటి లవ్ స్టోరీ ఈ "బలం". ఈ చిత్రం హిందీ ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డు బ్రేకింగ్ స్థాయి లో కేవలం 48 గంటల్లో 25 లక్షల వ్యూస్ వచ్చాయి. బలం పై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పటానికి ఇదొక ఉదాహరణ", అని చిత్ర బృందం తెలిపింది.

Hrithik Roshan's Balam first look

ఆంధ్రా, నిజాం ఏరియా హక్కులను రాజశ్రీ సంస్థ దక్కించుకోగా, కర్ణాటక హక్కులను యాష్ రాజ్ సంస్థ దక్కించుకుంది. మళయాలం హక్కులను ప్రఖ్యాత నటుడు మోహన్ లాల్ దక్కించుకున్నారు.

సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 2017 న విడుదల అవుతుంది. గతం లో హృతిక్ నటించిన క్రిష్ చిత్రాలు మరియు ధూమ్ 2 చిత్రం తెలుగు లో విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హృతిక్ కి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో, తెలుగు లో కూడా భారీ విడుదల కు నిర్మాతలు సిద్ధ పడుతున్నారు.

English summary
Hrithik Roshan and Rakesh Roshan are back together for the different action thriller "Kaabil". This revenge drama has a beautiful love story as its base. The Telugu version has been titled 'Balam' and it will have a big release in Telugu markets. The first look poster has been released by the film unit on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu