»   » హృతిక్ వంచన.. అంతం చేసే కుట్ర.. ప్రాణాలకు ముప్పు

హృతిక్ వంచన.. అంతం చేసే కుట్ర.. ప్రాణాలకు ముప్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ పరిశ్రమలోని చాలా మంది తనను అణగదొక్కాలని, తన కెరీర్‌‌ను నాశనం చేయాలని ప్రయత్నించారని బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ఆరోపించింది. గోప్యంగా సాగుతున్న తమ సంబంధం ప్రస్తుతం బహిరంగమైందని, ఇప్పుడు ఆ వివాదంలో మూడో వ్యక్తి తలదూర్చాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రౌనత్ మధ్య రొమాంటిక్ రిలేషన్స్ వ్యవహారం మరోసారి మీడియాలో రచ్చగా మారుతున్నది. తమ మధ్య తలెత్తిన వివాదంపై ఇప్పటివరకు వారు వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. తాజాగా రంగూన్ చిత్రంలో నటిస్తున్న కంగన ఈ మధ్య జాతీయ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హృతిక్‌తో ఉన్న రిలేషన్స్, తదితర అంశాలను వెల్లడించడం మళ్లీ ఈ అంశం వివాదాస్పదంగా మారింది.

హృతిక్ ఏడ్చాడు.. కట్టు కథలు అల్లాడు..

హృతిక్ ఏడ్చాడు.. కట్టు కథలు అల్లాడు..

‘తమ మధ్య వివాదం తలెత్తిన తర్వాత హృతిక్ పరిశ్రమలోని చాలా మంది పెద్దలకు వెళ్లి కలిశారు. వారి వద్ద ఏడ్చి నాపై లేనిపోనివ్వని చెప్పాడు. దాంతో కొంతమంది ప్రముఖులు నాకు ఫోన్ చేశారు. హృతిక్ తన వద్ద ఉన్న ఆధారాలను చూపించాడు. నీ వైపు తప్పు లేదని రుజువు చేసుకోవడానికి మా వద్దకు వచ్చి నీ వద్ద ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు' అని కంగన తెలిపింది. అయితే తమ మధ్య తలెత్తిన వివాదంతో వారికి సంబంధం లేదని భావించడం వల్ల వారి వాదనను తేలిగ్గా తీసుకొననానని ఆమె పేర్కొన్నారు.

తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు

తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు

ఈ వివాదంలో తన తల్లిదండ్రులను బెదిరించారు. వారు అభద్రతాభావానికి గురయ్యేలా కొందరు వ్యవహరించారు. నా తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. నన్ను కూడా బహిరంగంగా బెదిరించారు. ప్రతీ ఒక్కరు షాక్ తినే విధంగా కొన్ని డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేస్తామని హెచ్చరించారు. కేవలం నన్ను బెదిరించడానికే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అర్థమైంది. అయితే నా ప్రతిష్థకు భంగం కలిగించే విధంగా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.

కంగనాకు హృతిక్ లవ్ ప్రపోజల్ పంపాడా?

కంగనాకు హృతిక్ లవ్ ప్రపోజల్ పంపాడా?

ఒకరికొకరు పంపుకొన్న ఈమెయిల్స్ హృతిక్, కంగనల మధ్య వివాదానికి కారణమైంది. ఈమెయిళ్ల ద్వారా కంగనాకు హృతిక్‌ ప్రేమ ప్రతిపాదన చేసిండానే ఆరోపణ. ఈ వ్యవహారంపై ఈమెయిళ్ల గురించి దర్యాప్తు చేయాలని సైబర్ క్రైం విభాగాన్ని హృతిక్ కోరిన సంగతి తెలిసిందే. దాంతో విచారణ చేపట్టిన పోలీసులు సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసివేశారు. ఆ తర్వాత కూడా ఈ వ్యవహారాన్ని హృతిక్ వర్గం వివాదం చేయడానికి ప్రయత్నించినట్టు కంగన లాయర్ అప్పట్లో ఆరోపించారు.

వంచించే వ్యక్తి వెనుక పడటం నా స్వభావం కాదు..

వంచించే వ్యక్తి వెనుక పడటం నా స్వభావం కాదు..

ఈ వివాదానికి సంబంధించి తాను క్షమాపణ చెప్పాలని హృతిక్ కోరుకొన్నాడని కంగన తెలిపింది. వంచించే వ్యక్తి వెనుక పడటం తన స్వభావం కాదని పేర్కొన్నది. ఈ వివాదం తనకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టిందన్నారు. చివరికి ఎలాగోలా ఈ వివాదం నుంచి సులభంగా బయటపెడ్డాడని ఆయన అన్నారు. కేవలం సెన్సేషలనిజం కోసం అల్లిన వివాదమన్నారు.

English summary
Hrithik Roshan and his team are once again desperately trying to salvage the situation, says Kangana Ranaut
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu