»   » మొదటి అడుగు ఇక్కడినుంచే... "హృదయాంజలి" కొసం ఇలా

మొదటి అడుగు ఇక్కడినుంచే... "హృదయాంజలి" కొసం ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొద్దిరోజులుగా అన్న హాష్‌ట్యాగ్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఇంతకీ ఈ FFF అంటే ఏమిటంటే "ఫ్రెండ్స్ ఫండింగ్ ఫీచర్ ఫిలిమ్". క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాకోసం యెన్నెన్జీ మోషన్ పిక్చర్స్ (Yennengee Motion Pictures) పతాకంపై యువదర్శకుడు యెన్నెన్జీ హృదయాంజలి అనే రోడ్ థ్రిల్లర్ మూవీ మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ మూడు భాషల్లోనూ నిర్మించ బోతున్న ఈ సినిమా ప్రాజెక్ట్ వాల్యూ ఒక కోటిరూపాయలు గా నిర్ణయించుకొని. దానికి కావాల్సిన నిధులను, నగదూ, టెక్నికల్ సపోర్ట్ ల రూపం లో వాడుకుంటూ సినిమాను తెరకెక్కీంచే ప్రయత్నం లో ముందుకు సాగుతున్నాడు ఈ కొత్త తరం దర్శకుడు.

ఈ సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు యెన్నెన్జీ "మేము ఫండింగ్ కోసం కోరుకుంటున్నది సినిమా అనేది ఫ్యాషన్ (Fashio) ఉన్నవాళ్లు కాదు.. ప్యాషన్ (Passion) ఉన్నవాళ్లు ... వాళ్ళు ఎంతైనా ఇవ్వొచ్చు ఒక వేయి నుండి పది లక్షల వరకు ఎంతయినా ఇవ్వవచ్చు. ప్రతీ పైసానీ సద్వినియోగం చేసుకోగలం అన్న నమ్మకం తోనే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. మూడు భాషల్లో నిర్మించబడుతున్న ఈ చిత్రం ప్రాజెక్ట్ వాల్యూ ఒక కోటి. అయితే మొత్తం కోటి రూపాయలనూ మేం కోరుకోవటం లేదు టెక్నికల్గా వచ్చే సపోర్ట్ నికూడా లెక్కగట్టుకునే మొత్తం బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాం. మొత్తం పూర్తయ్యాక హృదయాంజలి విజయం ఎలాఉంటుందో ఊహించగలం కాబట్టే ఈ సాహసానికి పూనుకున్నాం" అంటూ చెప్పారు.

Hrudayanjali movie team starts crowd funding from today

ఈ సినిమా కోసం నిధులను సేకరించే కార్యక్రమన్ని ఈ రోజు సాయంత్రం రవీంధ్ర భారతిలో మొదలుపెట్టబోతున్నారు. ఇదే కార్యక్రమం లో ప్రముఖ ఫొటో గ్రాఫర్, రచయిత కందుకూరి రమేష్ బాబు క్రౌడ్ ఫండింగ్ సినిమా పై ప్రసంగిస్తారు. భాష సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సినీప్రముఖులు మరికొందరు పాల్గొనే ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మొదలవనుంది.

English summary
Hrudayanjali movie Unit planning to collect the money from Crowd funding concept. They are formulated a concept that Friends Funding for Feature film.This movie going on sets soon. Narender goud Naguloori is directing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu