»   » "హృదయాంజలి" పై పెరుగుతున్న అంచనాలు... మూడు ఇండస్ట్రీల నటులతో...

"హృదయాంజలి" పై పెరుగుతున్న అంచనాలు... మూడు ఇండస్ట్రీల నటులతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

FFFF ఫ్రెండ్స్ ఫండింగ్ ఫీచర్ ఫిల్మ్ పేరుతో తెలుగు చిత్రపరిశ్రమలో ఆసక్తి కలిగించిన హృదయాంజలి సినిమా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సినిమాలను ఓవర్సీస్ లో పంపిణీ చేస్తూ... హాలీవుడ్ సినిమాలకూ పార్టనర్ గా ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హృదయాంజలి సినిమా నిర్మాణంలో పార్టనర్ షిప్ కోసం ప్రయత్నిస్తున్నారట.

Hrudayanjali movie with Telugu, Tamil, Kannada actors

FFFF కాన్సెప్ట్ తో.... అటు పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కలిగించిన ఈ సినిమా గురించి ఎన్.ఆర్.ఐల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆ సంస్థ హృదయాంజలి టీమ్ ను సంప్రదించినట్లు సమాచారం. స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, ప్రమోషన్ విధానం కొత్తతరహాలో ఉండడంతో ప్రాజెక్టులో భాగస్వామ్యానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Hrudayanjali movie with Telugu, Tamil, Kannada actors

మంచి సినిమాలు రావాలంటే మనమే నిర్మాతలమవుదాం...అనే కాన్సెప్ట్ తో సినిమా అభిరుచి కల ప్రేక్షకులకు కూడా నిర్మాతలయ్యే అవకాశమిచ్చింది హృదయాంజలి టీమ్. యాది, రాజిగ ఓరి రాజిగ లాంటి లఘు చిత్రాలతో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఎన్నెన్జీ దర్శకత్వంలో... తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో మూడు పరిశ్రమలకూ చెందిన ప్రముఖ నటీనటులు నటించనున్నారు.

English summary
Upcoming tollywood Filim Hrudayanjali movie details out. The movie directed by Yennengee, starring Telugu, Tamil, Kannada actors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu