»   » ‘శ్రీమంతుడు’ కోసం బడా కంపెనీల పోటీ

‘శ్రీమంతుడు’ కోసం బడా కంపెనీల పోటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘శ్రీమంతుడు' ఎంత పెద్ద విజయం సాధిచిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి తర్వాత భారీ బిజినెస్ నమోదు చేసిన చిత్రంగా ఈ సినిమా రికార్డుల కెక్కింది. సినిమాలో మెసేజ్ తో పాటు, కమర్షియల్ హంగులు కూడా ఉండటంతో ప్యామిలీ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. నిర్మాతలకు లాభాల పంట పండించింది.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. థియేటర్ల రెంట్, ఇతర ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూటర్లకు రూ. 66.5 కోట్ల షేర్ వచ్చింది. మొదటి 7 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 66,57,99,056 షర్ కలెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఓవరాల్ బిజినెస్ లో ఈ చిత్రం రూ. 85 నుండి 90 కోట్లు షేర్ సాధించినట్లు టాక్.


తాజాగా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు వయాకమ్-18, ఎరాస్ ఇంటర్నేషనల్ పోటీపడుతున్నట్లు టాక్. శ్రీమంతుడు సినిమా రీమేక్ రైట్స్ కోసం ట్రై చేస్తున్న వయాకమ్ సంస్థ.. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ చేయాలనుకుంటోందట. ఇదే రైట్స్ కోసం ప్రయత్నిస్తున్న ఎరాస్ సంస్థ తమ హీరోగా వరుణ్ ధావన్‌ను ఫిక్సయ్యిందని సమాచారం. మరి చివరకు ఈ సినిమా రైట్స్ ఎవరికి దక్కుతాయో చూడాలి.


మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.


ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Huge Competition for Srimanthudu hindi remake rights.
Please Wait while comments are loading...