»   » చిరంజీవి బర్త్ డే కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు!

చిరంజీవి బర్త్ డే కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఈ సంవత్సరం ఆగస్టులో ఆయన 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. మరో వైపు ఆయన 150వ సినిమా ‘ఆటో జానీ' కూడా ఈ సంవత్సరమే మొదలు కాబోతోంది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇటు మెగా ఫ్యామిలీ, అటు మెగా ఫ్యాన్స్ ఏర్పాట్లు భారీగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన పలు చిత్రాలను...చిరంజీవి బర్త్ డే వారోత్సవాల సందర్భంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రధాన నగరాల్లో మెగా అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. దీంతో పాటు భారీ జన సమీకరణతో బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కనీ వినీ ఎరుగని రీతిలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యేలా, నేషనల్ మీడియాను సైతం ఆకర్షించేలా బర్త్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Huge Plans For Megastar Chiranjeevi's 60th Birthday

చిరంజీవి పెట్టినరోజు సందర్భంగా ఆయన 150వ సినిమా అఫీషియల్ గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా... పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారు. పుట్టినరోజు వేడుక సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలే వారే స్వయంగా వెల్లడిస్తారని తెలుస్తోంది.

చిరంజీవి బర్త్ డే వారోత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో సింగింగ్, డాన్సింగ్ కాంపిటీషన్లు నిర్వహించబోతున్నారట. విజేతలకు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు సేవా కార్యక్రమాలు కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు.

పలు ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు... రక్తదానం, నేత్రదానం క్యాంపులు కూడా నిర్వహించబోతున్నారు. పేదలకు వస్త్రధానం, మొక్కలు నాటడం, అన్నదానం, స్పెషల్ పూజా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్.... ఇలా చాలా కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Megastar Chiranjeevi, who ruled the silver-screen for 30 long years, is turning 60 this year. While his come back film Auto Jaani is also on cards, some huge plans are being made by Mega fans and Mega family to celebrate the actor's birthday.
Please Wait while comments are loading...