Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో శివాజీ అరెస్ట్.. తప్పించుకొని విదేశాలకు.. పారిపోతుండగా అదుపులోకి..
నటుడు శివాజీని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. అలంద మీడియా కేసుకు సంబంధించి గత కొంతకాలంగా పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్న శివాజీని సైబరాబాద్ పోలీసులు కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ క్రైమ్ పీఎస్‌కి శివాజీని తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రవిప్రకాష్, శివాజీనలపై కేసు
టీవీ 9 వివాదం విషయమై అలంద మీడియా సంస్థ కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో ఓ ముద్దాయిగా గత కొంతకాలంగా విచారణ ఎదుర్కొంటున్నాడు శివాజీ. టీవీ 9 సిఈఓ రవిప్రకాష్ తో పాటు నటుడు శివాజీ పై కేసు పెట్టింది టీవీ 9 కొత్త యాజమాన్యం అలంద మీడియా సంస్థ. టీవీ 9 వాటాల విషయంలో వీరిద్దరూ ఫోర్జరీ సంతకాలు చేశారని అలంద మీడియా ఆరోపించింది.

పలుమార్లు సందేశాలు.. హైకోర్టు ఆశ్రయించిన శివాజీ
దీంతో తమ ముందు హాజరుకావాలని రవి ప్రకాష్‌తో పాటు శివాజీకి కూడా నోటీసులు జారీ చేసింది పోలీసు శాఖ. అయితే రవిప్రకాష్ విచారణకు హాజరైనప్పటికీ శివాజీ మాత్రం ఇప్పటిదాకా పోలీసుల విచారణలో పాల్గొనలేదు. ఈ మేరకు విచారణకు రావాలంటూ శివాజీకి పలుమార్లు సందేశాలు పంపినా ప్రయోజనం లేదు. పైగా సైబర్ క్రైమ్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ శివాజీ హైకోర్టును కోరడం జరిగింది.

శివాజీ ఆరోపణ.. కేసు వాయిదా
తనపై సైబర్ క్రైమ్ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని, ఆ కేసును వెంటనే కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా హైకోర్టును సంప్రదించారు శివాజీ. తనను పోలీసులు ముందస్తు అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ కోరారు శివాజీ. మరోవైపు ఇప్పటి వరకు శివాజీకి మూడు సార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. ఇరుపక్షాల వాదనలు కూలంకషంగా పరిశీలించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను జూన్ 26 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆ సమయంలో కోర్టు ప్రకటించింది.

దేశం దాటి వెళ్లే ప్రయత్నం.. పోలీసుల అదుపులో శివాజీ
కాగా కొద్దిసేపటి క్రితమే శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసుకు హాజరు కాకుండా ఆయన దేశం దాటి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నామని అన్నారు. కేసుకు సహకరించాల్సిందిగా ఆయనకు తెలిపామని చెప్పారు. కోర్టు నోటీసుల ఆధారంగానే శివాజీపై తదుపరి విచారణ జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు.