twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ నటికి తీవ్ర వేధింపులు.. న్యూడ్ ఫోటోలు ఉన్నాయంటూ టార్చర్.. అలా దొరికేశాడు!

    |

    లైంగిక వేధింపులు విషయంలో ఎన్ని చట్టాలు తీసుకు వస్తున్నా ఇంకా కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా ఎలా మహిళలను వేధించాలీ అనే విషయాలు కూడా వారు ఆన్ లైన్ లో చూసి ట్రైన్ అవుతున్నారు. ఇప్పుడు సైబర్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆ టెక్నాలజీ వాడుకుని బాగు పడాల్సింది పోయి మహిళలను ఎలా వేధించవచ్చు అనే విషయాల మీద దృష్టి పెట్టి చివరికి ఆ టెక్నాలజీ సాయంతో పోలీసులకు పట్టుబడుతున్నారు. అలా టెక్నాలజీ సాయంతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటి ఫోన్ నెంబర్ సేకరించిన ఒక వ్యక్తి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. స్టార్ మేకర్స్ అనే ఒక యాప్ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ సేకరించిన ఒక ఆకతాయి ఆ ఫోన్ నెంబర్ కి అసభ్య మెసేజ్ లు పంపించి ఆమెను మానసిక క్షోభకు గురి చేశాడు.

    కేవలం అసభ్య పదజాలం వాడటమే కాక వాయిస్ మెసేజ్ లతో పాటు ఆమెకు అడపాదడపా ఫోన్లు కూడా చేస్తూ ఉండేవాడు ఆమె కట్ చేసిన ప్రతిసారి మీ న్యూడ్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని బెదిరించేవాడు. తాను చెప్పినట్లు చేయకపోతే మీ జీవితం నాశనం అవుతుంది అంటూ ఆమెను మనోవేదనకు గురి చేయడంతో ఆమె ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ లో ఉన్నాను కాబట్టి ఇలాంటి విషయాలు బయటకు వస్తే తన కెరీర్ ఇబ్బంది పడుతుందని భావించిన ఆమె చాలా రోజుల పాటు ఇబ్బందులను అలాగే భరిస్తూనే వచ్చింది. అయితే అతని వేధింపులు తీవ్రం కావడంతో ఇక ఏది జరిగితే ఎలా జరిగిందని భావించి హైదరాబాద్ పోలీసులకు సంబంధించిన షీ టీమ్స్ ను సంపాదించింది.

     Hyderabad she team arrested a man miss behaving with tollywood actress

    తన ఫోన్ నెంబర్ తెలుసుకుని ఒక వ్యక్తి తన టార్చర్ పెడుతున్నాడు అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్ళింది. షీ టీమ్స్ అందించిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అలా మెసేజ్ లు చేస్తున్నది ఎవరో తెలుసుకునే అతనిని అరెస్టు చేశారు. అయితే పోలీసులు చెబుతున్న సమాచారం మేరకు కేవలం నటులు మాత్రమే కాదు మహిళల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా సంప్రదించవచ్చని వారి కోసం ఎల్లవేళలా అండగా ఉంటామని చెబుతున్నారు. ఇక కేవలం రెండు నెలల సమయంలో షీ టీమ్స్ వెయ్యికి పైగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించగా అందులో 248 మంది ప్రత్యక్షంగా దొరికిపోయారు. నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయ లేని వారి కోసం వాట్సాప్ ద్వారా ట్విట్టర్ ,హ్యాక్ ఐ, ఈమెయిల్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలా రకరకాల దారులలో ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నారు పోలీసులు.

    English summary
    Hyderabad she team, police, tollywood actress
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X