India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda: బాలకృష్ణకు పోలీసులు స్పెషల్ థ్యాంక్స్.. ఆ వీడియోను షేర్ చేసి ఊహించని విధంగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. అందులో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'సింహా', 'లెజెండ్' అనే సినిమాలు చేశారు. ఈ రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్‌కు విశేషమైన గుర్తింపు దక్కింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, భారీ కలెక్షన్లను సైతం రాబట్టింది. ఇక, ఇప్పుడు ఈ సినిమా గురించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముంది? ఆ వివరాలు మీకోసం!

  ‘అఖండ’గా బాలయ్య విశ్వరూపం

  ‘అఖండ’గా బాలయ్య విశ్వరూపం


  నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన మూవీనే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చాడు. ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

  హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

  రికార్డులతో యాభై రోజుల ప్రస్థానం

  రికార్డులతో యాభై రోజుల ప్రస్థానం

  ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'అఖండ' మూవీ ఇటీవలే యాభై రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా ఏకంగా 103 సెంటర్లలో ఈ ఫీట్‌ను అందుకుంది. తద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువ థియేటర్లలో యాభై రోజులు ఆడిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, ఈ ప్రయాణంలో హీరో బాలయ్య ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులు కూడా వచ్చి చేరిన విషయం తెలిసిందే.

  అఖండ సినిమాకు వచ్చిందెంత?

  అఖండ సినిమాకు వచ్చిందెంత?


  భారీ బడ్జెట్‌తో రూపొందిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 74.58 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా రూ. 20.58 కోట్లు లాభాలను కూడా అంందుకుని రికార్డులు క్రియేట్ చేసుకుంది.

  Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!

  అందులో స్ట్రీమింగ్.. రికార్డులు బ్రేక్

  అందులో స్ట్రీమింగ్.. రికార్డులు బ్రేక్


  రెండు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఇక, జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డులు నమోదు చేసింది.

  ఆ వీడియో షేర్ చేసిన పోలీసులు

  ఆ వీడియో షేర్ చేసిన పోలీసులు

  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీ అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకుంది. దీంతో అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అందులో అఖండ మూవీలో 'బాలయ్య హీరోయిన్‌కు సీట్ బెల్ట్ పెట్టిన' దృశ్యాలను చూపించారు.

  హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!

  బాలయ్య, బోయపాటికి థ్యాంక్స్

  బాలయ్య, బోయపాటికి థ్యాంక్స్


  'అఖండ' మూవీలో ఓ సందర్భంలో బాలయ్య 'సీటు బెల్టు పెట్టుకోవాలని' సందేశాత్మకంగా డైలాగ్ చెబుతాడు. ఈ వీడియోనే షేర్ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 'ఎంత దూరమైనా? ఎవరి కార్ అయినా సరే ఎప్పుడూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. రోడ్డు భద్రతను ప్రోత్సహించిన బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు.

  English summary
  Nandamuri Balakrishna Did Akhanda Movie Under Boyapati Srinu Direction. Now Hyderabad Traffic Police Shared This Movie Scene and Thanks to Balayya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X