»   » ట్విట్టర్లో...రాజమౌళికి స్టార్ హీరో ఫ్యాన్ ఝలక్!

ట్విట్టర్లో...రాజమౌళికి స్టార్ హీరో ఫ్యాన్ ఝలక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు తన అనుభవాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళికి ట్విట్టర్లో ఊహించని అనుభవం ఎదురైంది. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఓ స్టార్ హీరో అభిమాని రాజమౌళి చేసిన ట్వీట్‌పై కాస్త రాష్‌గా స్పందించాడు. అయితే రాజమౌళి సమయస్ఫూర్తితో అతడానికి ప్రతిజవాబు ఇచ్చాడు.

ఇక్కడ కనిపిస్తున్న ఫోటో...రాజమౌళి షాంఘై టూర్‌కు సంబంధించింది. రాజమౌళి పోస్టు చేసిన ఈ ఫోటోపై ఓ వ్యక్తి స్పందిస్తూ....'నువ్వు తాగావని తెలుసు, ట్వీట్ చేయడం ఆపి వెళ్లి పడుకో' అంటూ కామెంట్ చేసాడు. దీనికి రాజమౌళి స్పందిస్తూ 'యు ఆర్ రైట్...ఎక్సైట్‌మెంట్‌తో తాగాను...దాని మీనింగ్ ఏమిటో నీకు తెలుసా?...నీ సూచనలు ఎప్పుడూ స్వీకరిస్తా' అంటూ రిప్లై ఇచ్చాడు.

షాంఘైలో జరుగుతున్న 16వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శనకు రాజమౌళి 'ఈగ' ఎంపికైంది. అందులో పాల్గొనేందుకు చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కూడా షాంఘై వెళ్లారు. ఈగ చిత్రాన్ని ఈ సంవత్సరాంతానికల్లా చైనాలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ చిత్రానికి 'కుంగ్ ఫూ హౌస్ ఫ్లై' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి 'ఈగ' ప్రదర్శనలో పాల్గొనడంతో పాటు, ఆయన తెరకెక్కించనున్న 'బాహుబలి' కోసం లొకేషన్లను కూడా పరిశీలిస్తారు. ఆ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా 'బాహుబలి' చిత్రం రూపొందుతోంది. అనుష్క హీరోయిన్ . రానా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న చిత్రమిది.

English summary
Tollywood director Rajamouli shared a picture from his Shangai tour on his twitter page, A star hero fan tells him to stop tweeting when he is drunk and advised him go to bed. Rajamouli took it very sportively and replied “you are right .. I am drunk..with excitement…if you know what that means”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu