»   » అమీర్ ఖాన్ తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మీటింగ్

అమీర్ ఖాన్ తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మీటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిస్టర్ ఫెరఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ని దర్శకుడుగా ప్రతీ విభాగంలోనూ పెరపెక్షన్ కోరుకుని విజయాలు సాధిస్తున్న రాజమౌళి ఈ రోజు(డిసెంబర్ 31 న) కలుస్తున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆ ట్వీట్ లో...నేను నా ఐడిల్ అమీర్ ఖాన్ ని కలవబోతున్నాను. చాలా ఉద్వంగంగా ఉంది. ఆయన మగధీర చూసి ప్రశించారు. అప్పుడు నేను మీతో కాలవాలని అడిగాను. ముంబైలో కలిసి ఆయనతో మాట్లాడబోతున్నాను అన్నారు. ఇక అమీర్ ఖాన్...ఆయన వెడ్డింగ్ ఏనవర్శిరీ(డిసెంబర్ 28) హాలిడే ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చారు. రాజమౌళి ...ఈ మీటింగ్ పూర్తి చేసుకుని ఈ రోజే హైదరాబాద్ చేరుకుంటారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని తన స్నేహితులు, సన్నిహితులతో జరుపుకుంటారు. ఈ సంతోష సమయంలో రాజమౌళికి ధట్స్ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu