twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవి పెద్ద బాంబే పేల్చాడే: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై కొత్త వివాదం, అసలేం జరిగింది?

    |

    రాజకీయాల్లోనూ.. సినిమాల్లోనూ.. తెలుగునాట శిఖర సమానుడైన ఎన్టీఆర్ బయోపిక్ అంటే అన్ని వర్గాల్లోనూ ఆసక్తే. ఆయన జీవితం పట్ల జనాల్లో ఉన్న క్యురియాసిటీ రీత్యా.. ఎవరికి వారు బయోపిక్స్ చేస్తున్నామంటూ ప్రకటించేశారు. అయితే వాటన్నింటిలో ఆర్జీవి 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పైనే ఇప్పటికీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. పైగా ఆ సినిమాను వైసీపీ నేత రాకేశ్ రెడ్డి చేస్తుండటం కూడా దీని వెనుక మతలబు ఏంటన్న చర్చలకు తావిచ్చింది. ఇలాంటి నేపథ్యంలో రాంగోపాల్ వర్మ పెద్ద బాంబే పేల్చారు.

    ఆర్జీవి ప్రెస్ నోట్:

    ''లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నేను వైసీపీకి చెందినన రాకేశ్ రెడ్డితో చేయబోవడంలేదు. ఈ ఇంటర్వ్యూలో(లింకు పోస్ట్ చేశారు) రాకేశ్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు. ఈ అబద్దాలు చెప్పడం వైసీపీలోని పెద్దలను మోసం చేయడానికా? లేదా ఇంకెవరినైనా మోసం చేయడానికా? అన్నది వాడికే తెలియాలి. తనకు నాకూ ఏవిధమైన సంబంధం లేదని చెప్పడానికే ఈ నోట్ విడుదల చేస్తున్నాను' అని ఫేస్ బుక్ ద్వారా వర్మ వెల్లడించారు.

    ఇంతకీ రాకేష్ రెడ్డి ఏమన్నారు:

    ఇంతకీ రాకేష్ రెడ్డి ఏమన్నారు:

    లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతగా ప్రచారం పొందుతున్న వైసీపీ నేత రాకేష్ రెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవితో పరిచయం, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విశేషాల గురించి చెప్పారు. అయితే రాకేష్ రెడ్డి చెప్పిన ఆ విషయాలన్ని అవాస్తవమనేది వర్మ వాదన. మరి రాకేష్ రెడ్డి ఎందుకు ఆ అబద్దాలు చెప్పినట్టు?..

    ఆర్జీవితో పరిచయం గురించి:

    ఆర్జీవితో పరిచయం గురించి:

    హైదరాబాద్ లో ఊర్వశి హోటల్ అని ఉండేది. ఆ హోటల్ వ్యక్తి శీను ఆర్జీవిని నాకు పరిచయం చేయించాడు. అప్పటినుంచి టచ్‌లో ఉంటూ వస్తున్నాం. కానీ కలిసి సినిమా చేస్తామని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఆ టైమ్‌లో వర్మ అంటే అభిమానం, క్రేజ్ ఉండేది నాకు.

     రక్త చరిత్ర విడుదలయ్యాక..:

    రక్త చరిత్ర విడుదలయ్యాక..:

    చాలా గ్యాప్ తర్వాత.. రక్తచరిత్ర విడుదలయ్యాక వర్మను నేను వ్యక్తిగతంగా కలిశాను. ముంబైలో మా కన్‌స్ట్రక్షన్ పార్ట్‌నర్‌ను కలవడానికి వెళ్లి.. అక్కడ కాస్త టైమ్ దొరకడంతో వర్మకు ఫోన్ చేశాను. దీంతో ఆఫీసులోనే ఉన్నాను వచ్చేయండన్నారు. వెళ్లాక రక్తచరిత్ర గురించి అడిగాను. ఇంత నేచురల్‌గా రియలిస్ట్‌గా ఎలా తీశారని అడిగితే.. ప్రతీ విలేజ్ వెళ్లి దాని గురించి విచారించినట్టు చెప్పారు. ఆ తర్వాత నుంచి వర్మ, నేనూ వాట్సాప్‌లో టచ్‌లో ఉంటున్నాం.

     లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా మొదలైంది..:

    లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా మొదలైంది..:

    ఒకసారి విజయవాడలో కలిసినప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చేయాలనుకుంటున్నానని వర్మ నాతో చెప్పారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ను వివాహం చేసుకున్న తర్వాత పరిణామాల గురించి చాలామందికి తెలియదని ఆ సబ్జెక్ట్ మీద చేద్దామని అన్నారు. అప్పటికే మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో.. ఇద్దరం కలిసి చేయాలనుకున్నాం. నువ్వు ప్రొడ్యూస్ చేస్తే ఇంకా హ్యాపీ అని వర్మ అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.

    కథ ఏం చెప్పబోతున్నారు..:

    కథ ఏం చెప్పబోతున్నారు..:

    ఎన్టీఆర్ జీవిత చరిత్రలో పెళ్లయినప్పటి నుంచి ఎండింగ్ వరకు చూపించబోతున్నాం. అంతకుముందు జరిగిన పరిణామాలు బ్రీఫ్‌గా 2,3నిమిషాలు చూపిస్తాం. రాజకీయ కోణంలో వైసీపీకి లక్ష్మీ పార్వతికి అనుకూలంగా తీయబోతున్నారన్న విమర్శలు అవాస్తవం. అలాంటిదేమి లేదు. పాలిటిక్స్ తో అసలు సంబంధం లేదు. ఆర్జీవి రియాలిటీతో తెరకెక్కిస్తాడనే చేస్తున్నా.

    కలరింగేనా?:

    కలరింగేనా?:

    లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో రాకేష్ రెడ్డిది కలరింగే తప్ప.. సినిమా అసలు మొదలే కాలేదన్న విమర్శలున్నాయని యాంకర్ ప్రస్తావించారు. దీనికి బదులిస్తూ.. 'సినిమా షూటింగ్ జరుగుతోంది. జూన్ ఎండ్‌కి ఫస్ట్ కాపీ వచ్చాక చూపిస్తాం' అని చెప్పారు రాకేష్ రెడ్డి.

    అంతేకాదు, కేవలం ఈ సినిమాను తన రాజకీయ పలుకుబడి కోసం, వైసీపీ నుంచి టికెట్ పొందడం కోసం చేస్తున్న ప్రయత్నంగా చూడటాన్ని ఆయన తప్పుపట్టారు. అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు.

    English summary
    Controversial Director Ramgopal Varma posted a write up in facebook on YSRCP Leader Rakesh Reddy. RGV clearly said that he is not doing movie under his production.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X