»   » పర్ఫెక్ట్ కాదు, నన్ను అలా పిలవద్దు: మహేష్ బాబు

పర్ఫెక్ట్ కాదు, నన్ను అలా పిలవద్దు: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ గా ఉంటారని, సినిమాకు సంబంధించిన ఏదైనా, ఏ సీన్ అయినా పర్ ఫెక్టుగా చేయాలని అనుకుంటారనే పేరు ఉంది. ఆయన చేసే ఏదైనా సీన్ బాగాలేదనే ఫీలింగ్ వస్తే మళ్లీ మళ్లీ రీ రీటేకులు చేయిస్తారట.

అందుకు మహేష్ బాబుతో పని చేసిన వారంతా ఆయన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అంటుంటారు. తాజాగా బ్రహ్మోత్సవం ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు వద్ద ఇలాంటి ప్రస్తావనే వచ్చింది. దానికి ఆయన నవ్వేస్తూ తాను పర్ఫెక్షనిస్ట్ కాదని.. తనను అలా పిలవద్దని అన్నాడు.


Also See: బ్రహ్మోత్సవం, సితార సెంటిమెంట్, నెక్ట్స్ ప్రాజెక్ట్...(మహేష్ ఇంటర్వ్యూ)


తానేదో గొప్పగా నటించేయాలని.. మంచి పేరు సంపాదించాలని రీటేక్స్ తీసుకోనని.. కేవలం సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకునే అలా ప్రయత్నిస్తాను. దర్శకుడు కోరుకున్నది ఇస్తున్నామా లేదా అనే చూస్తా. సంతృప్తి లేకుంటే ఎన్ని టేకులైనా తీసుకుంటా. అంతే కానీ పేరు కోసం చేయను. పర్ఫెక్షనిస్ట్ లాంటి ముద్రలు పడాలని కోరుకోను అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.


I am not a perfectionist: Mahesh Babu

బ్రహ్మోత్సవంలో పేరు లేదు...
ఇంతకు ముందు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్ బాబుకు పేరు లేదు. సినిమాలో వెంకీని, మహేష్ ను అంతా పెద్దోడు, చిన్నోడు అని ముద్దు పేర్లతో మాత్రమే పిలుస్తారు. బ్రహ్మోత్సవంలో కూడా మహేష్ బాబు పాత్రకు పేరు పెట్టలేదట దర్శకుడు.


దీనిపై మహేష్ బాబు స్పందిస్తూ....'బ్రహ్మోత్సవం'లో కూడా నాకు ఏ పేరూ లేదు. మరి మిగతా పాత్రధారులు నన్నేమని పిలుస్తారో తెరమీదే చూడండి. ఇది శ్రీకాంత్ గారి స్టయిల్. ఇలా ఎలా సాధ్యం అని.. పేరు లేకుండా స్క్రిప్టు ఎలా తయారు చేస్తారని ఆయన్ని ఓసారి అడిగాను కూడా. ఐతే ప్రతి పాత్రకూ ఓ ఐడెంటిటీ ఉంటుందని.. పేరు పలకాల్సిన అవసరం రాకుండానే సన్నివేశాలు రాస్తానని శ్రీకాంత్ చెప్పాడు'' అని మహేష్ వెల్లడించాడు.

English summary
"I am not a perfectionist, don't call me like that" said Mahesh Babu in interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu